Madan lal: మాజీ ఎమ్మెల్యే రాసలీలలు..! వైరల్ అవుతోన్న ఫొటోలు..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఇప్పటికే జాబితా సిద్ధం చేసినట్లు తెలిసింది. ఖమ్మం జిల్లా వైరా టికెట్ ఎవరిని వరిస్తుందో ఆ నియోజకవర్గ ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మాజీ ఎమ్మెల్యే రాసలీలలు బయటకొచ్చాయి. వైరా బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ మరోసారి తనకే వస్తుందంటూ ధీమాగా ఉన్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కూడా టికెట్ తనకే వస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
మరో మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి కూడా టికెట్ తనకే వస్తుందని ధీమాగా ఉన్నారు. మదన్ లాల్ అనుచురులు మరో అడుగు ముందుకేసి టికెట్ పక్కా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మదన్ లాల్ కు ఎదురు దెబ్బ తగిలింది. మదన్ లాల్ కు సంబంధించి కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. మదన్ లాల్ ఓ మహిళతో చాలా సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరా నియోజకవర్గంలో కలకలం సృష్టిస్తున్నాయి. ఫేస్ బుక్, వాట్సాప్ గ్రూపుల్లో ఈ ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆయనకు టికెట్ రాకపొవచ్చని భావిస్తున్నారు.

గార్ల బయ్యారంకు చెందిన వివాహితతో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కు వివాహేతర సంబంధం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. భర్తతో దూరంగా ఉంటున్న 32 ఏళ్ల యువతితో ఆయన సన్నిహితంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. గతంలో మదన్ లాల్ కొడుకు మృగేందర్ లాల్ పై కూడా రేప్ కేసు నమోదైంది. ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేశాడని, పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని ఆమె కూకట్ పల్లి పీఎస్ లో కంప్లైంట్ చేసింది.
2014లో వైఎస్సార్ సీపీ తరపున వైరా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన మదన్ లాల్ ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరాడు. 2018లో జరిగి ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫొటోలపై మదనలాల్ అనుచరులు స్పందించారు. అవి మార్ఫింగ్ ఫొటోలని చెబుతున్నారు. మదన్ లాల్ కు టికెట్ రాకుండా ఉండేందుకే ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాములు నాయక్ వర్గమే ఇలా చేసిందని ఆరోపించారు. అయితే రాముల నాయకు వర్గం ఆ ఫొటోలతో తమకు ఎలాంటి సమంబంధం లేదని చెబుతోంది. అయితే ఈ ఫొటోలపై మదన్ లాల్ ఇప్పటి వరకు స్పందించలేదు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications