వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రమాకాంత్ అది మాట్లాడలేదు, సిబిఐ కావాలనే చేసింది: అరెస్ట్ పిటిషన్‌పై కోర్టుకు జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సిబిఐ పిటిషన్‌పై శుక్రవారం కోర్టు స్పందించింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తన బెయిల్ రద్దు చేయాలన్న సిబిఐ పిటిషన్‌పై వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. మాజీ అధికారి రమాకాంత్ సాక్షితో మాట్లాడటం వంటి తదితర అంశాలపై స్పందించారు.

జగన్‌కు భారీ షాక్, సాక్షిలో ఇంటర్వ్యూ...: బెయిల్ రద్దు చేయాలని కోర్టుకు సిబిఐజగన్‌కు భారీ షాక్, సాక్షిలో ఇంటర్వ్యూ...: బెయిల్ రద్దు చేయాలని కోర్టుకు సిబిఐ

రమాకాంత్ రెడ్డి ప్రస్తావించిన అంశాలతో ఎలాంటి సంబంధం లేదని కౌంటర్ పిటిషన్‌లో జగన్ పేర్కొన్నారు. సిబిఐ అధికారులతో జరిపిన సంభాషణలను మాత్రమే రమాకాంత్ ఇంటర్వ్యూలో ప్రస్తావించారని చెప్పారు.

Petition for YS Jagan arrest: Jagan's lawyer filed counter petition

ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారని, ఆయన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని జగన్ పేర్కొన్నారు. సిబిఐ కావాలనే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చిందని జగన్ తన పిటిషన్లో ఆరోపించారు.

రమాకాంత్ రెడ్డి తన ఆస్తుల కేసు గురించి కానీ లేదా తన (జగన్) గురించి కానీ ఎక్కడా మాట్లాడలేదని పేర్కొన్నారు. తనను అరెస్టు చేయాలన్న సిబిఐ పిటిషన్‌ను కొట్టివేయాలని జగన్ కోరారు. కాగా, జగన్ తరఫున ఆయన న్యాయవాది కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం కోర్టు ఈ పిటిషన్‌పై విచారణను 21వ తేదీకి వాయిదా వేసింది.

పది రోజుల క్రితం సిబిఐ పిటిషన్

జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేసును ప్రభావితం చేసే విధంగా జగన్ ప్రవర్తిస్తున్నారని ఆ పిటిషన్‌లో పేర్కొంది.

సిబిఐకి వ్యతిరేకంగా జగన్ ఛానెల్‌లో ఇంటర్వ్యూ ప్రసారం చేశారని సిబిఐ అందులో పేర్కొంది. దీనిపై న్యాయస్థానం జగన్‌కు సమన్లు జారీ చేసింది. 7వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

వైయస్ రాజశేఖర రెడ్డి మృతి అనంతరం జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైసిపిని స్థాపించారు. తన తండ్రి హయాంలో ఆయన భారీగా అక్రమాలకు పాల్పడ్డారని కేసు నమోదయింది. దీనినిపై సీబీఐ విచారణ, ఈడీ దర్యాఫ్తు జరుగుతున్నాయి.

ఆ తర్వాత ఆయన జైలుకు వెళ్లారు. దాదాపు సంవత్సరంన్నర జైలులో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ వచ్చింది. విభజన అనంతరం.. జగన్ పార్టీ అయిన వైయస్సార్ కాంగ్రెస్ ప్రధానంగా ఏపీకే పరిమితం అయింది.

ఆయన అక్రమాస్తుల కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసు విచారణ నెమ్మదిగా సాగుతోందని టిడిపి, తనపై అక్రమ కేసులు బనాయించారని జగన్, వైసిపి నేతలు ఆరోపిస్తుంటారు. ఈ ఆరోపణల విషయం ఎలా ఉన్నా.. నాలుగైదేళ్ల తర్వాత మళ్లీ జగన్ బెయిల్ అంశం తెరపైకి వచ్చింది.

సాక్షిలో సీబీఐకి వ్యతిరేకంగా కథనం వచ్చిందని, ఆయన దర్యాఫ్తును ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేయాలని తాజాగా సీబీఐ కోర్టును ఆశ్రయించడం ఆయనకు పెద్ద దెబ్బ. ఈ రోజు (ఏప్రిల్ 7) జగన్ కౌంటర్ దాఖలు చేశారు.

English summary
Petition for YS Jagan arrest: HC dismissed CBI petition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X