శుభవార్త:జిఎస్‌టిలోకి పెట్రోల్, డీజీల్?, దీపావళికి తీపి కబురు

హైదరాబాద్: పెట్రోల్, డీజీల్‌లను కూడ జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్రప్రధాన్ ఇటీవల కాలంలో డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై జిఎస్‌టి కౌన్సిల్‌ను కోరనున్నట్టు ఆయన ప్రకటించారు. పెట్రోలియం ఉత్పత్తులను జిఎస్‌టి పరిధిలోకి తీసుకువస్తే రాష్ట్రాలు భారీగా ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనకు రాష్ట్రాలు ఒప్పుకొనే అవకాశం లేకపోవచ్చనే వాదనలు కూడ విన్పిస్తున్నాయి.

పెట్రోల్, డీజీల్ ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరిగాయి. మూడేళ్ళలో గరిష్టానికి పెట్రోల్, డీజీలు ధరలు పెరిగాయి. అయితే వచ్చే నెలలో డీజీల్, పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్రప్రధాన్ అభిప్రాయపడ్డారు.

పెట్రోల్, డీజీల్ ధరలను తగ్గాలంటే జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి ధర్మేంధ్రప్రధాన్ అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతోంది.

పెట్రోలియం ఉత్పత్తును జిఎస్‌టి పరిధిలోకి తెచ్చే విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కొందరు దీనికి అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఆర్థికశాఖు లేఖ రాసిన ఇంధనశాఖ

ఆర్థికశాఖు లేఖ రాసిన ఇంధనశాఖ

పెట్రోలియం ఉత్పత్తులను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ఆర్థికశాఖకు ఇంధనశాఖ కోరింది. వివిధ రాష్ట్రాల్లో పెట్రోలియం ఉత్పత్తులపై పలు రకాల పన్నులు ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గినా కానీ, పెట్రోలియం ఉత్పత్తుల దరలు మాత్రం తగ్గలేదు. దీంతో జిఎస్‌టి పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులను తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది.ఈ అంశాన్ని పరిశీలించాలని ఇంధనశాఖ కోరింది. అయితే ఆర్థికశాఖ ఈ విషయమై ఏ రకమైన నిర్ణయం తీసుకొంటోందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.జిఎస్‌టి కౌన్సిల్ తీర్మాణం చేస్తే మాత్రం పెట్రోలియం ఉత్పత్తులు జిఎస్‌టి పరిధిలోకి చేర్చక తప్పని అనివార్య పరిస్థితులు నెలకొంటాయి.

 పెట్రోల్ ధరలిలా తగ్గుతాయి

పెట్రోల్ ధరలిలా తగ్గుతాయి

జిఎస్‌టి పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులను చేర్చితే పెట్రోల్, డీజీల్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. జిఎస్‌టిలో చేర్చడం వల్ల వ్యాట్, ఎక్సైజ్ టాక్స్‌లుండవు. జిఎస్‌టిలో అత్యధిక శ్లాబ్ ట్యాక్స్ 28 శాతం.ఈ శ్లాబ్‌ను అమలు చేసినా లీటర్‌ పెట్రోల్ రూ.40కు మించదు.అయితే రాష్ట్రాలు భారీగా ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉందని కొందరు నిపుణులు అభిప్రాయంతో ఉన్నారు. దీంతో రాష్ట్రాలు జిఎస్‌టి పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులను చేర్చడాన్ని ఒప్పుకోకపోవచ్చనే అభిప్రాయాలు లేకపోలేదు.

పెట్రోల్, డీజీల్ పై పన్నుల భారాలిలా

పెట్రోల్, డీజీల్ పై పన్నుల భారాలిలా


పెట్రోల్, డీజీల్‌పై లీటర్‌కు పలు రకాల పన్నులను వినియోగదారుడు చెల్లిస్తున్నాడు. ఎక్సైజ్ పన్నును కేంద్ర ప్రభుత్వం విధిస్తోంది. వ్యాట్‌ను రాష్ట్రాలు విధిస్తున్నాయి. ఆయా రాష్ట్రాలు డీలర్ కమీషన్‌తో కలిపి వ్యాట్‌ ఛార్జీలను వినియోగదారులపై మోపుతున్నాయి. నిజానికి లీటర్ పెట్రోల్ ధర రూ.30.70, అయితే కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీ రూ.21.48, రాష్ట్రాలు విధించే పన్ను రూ.27, ఇందులో వ్యాట్ రూ.14.96, డీలర్ కమీషన్ రూ.3.24 ఉంటుంది. ఈ పన్నులన్ని కలిపి లీటర్ పెట్రోల్ ధర రూ.70.38కు చేరింది. అయితే ప్రతిరోజూ పెట్రోల్, డీజీల్ ధరల్లో మార్పులు ఉంటున్నాయి.

 దీపావళికి తీపి కబురు

దీపావళికి తీపి కబురు


దీపావళి నాటికి పెట్రోల్, డీజీల్ ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్రప్రధాన్ చెప్పారు. అయితే దీపావళి నాటికి పెట్రోలియం ఉత్పత్తులను జిఎస్‌టి పరిధిలోకి తెచ్చే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి. రాష్ట్రాలకు నష్టం పెద్దగా ఉండకపోవచ్చనే వాదనను వ్యక్తం చేసే వారు కూడ ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+