దాడి: సోదరులు ఎత్తుకెళ్లినా ప్రియుడితోనే వివాహం (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రేమ వివాహాన్ని యువతి సోదరులు అడ్డుకొని ప్రేమికుల పైన దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఉప్పుగూడ లలితా నగర్‌కు చెందిన దుర్గేష్ తన ఇంటి సమీపంలో ఉండే మౌనికను ప్రేమించాడు.
వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. సైదాబాదులోని ఆర్య సమాజ్‌లో స్నేహితుల సమక్షంలో సోమవారం నాడు రహస్యంగా వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న యువతి సోదరులు అక్కడకు వెళ్లి వీరంగం సృష్టించారు. వారి పైన దాడికి పాల్పడ్డారు.

ప్రేమికుల పెళ్లి
తన సోదరులతో వెళ్లేందుకు యువతి ససేమీరా అంది. దీంతో, ఆమెను ద్విచక్ర వాహనం పైన బలవంతంగా ఎక్కించుకొని తీసుకు వెళ్లారు.

ప్రేమికుల పెళ్లి
జరిగిన సంఘటన పైన సైదాబాద్ పోలీసులకు దుర్గేష్ ఫిర్యాదు చేశారు. మౌనిక కుటుంబ సభ్యులు దుర్గేష్ పైన ఛత్రినాక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ప్రేమికుల పెళ్లి
పోలీసులు మౌనికను పిలిచి అడిగారు. దానికి ఆమె తాను దుర్గేష్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను పోలీసు స్టేషన్లో విడిచి పెట్టి వెళ్లారు.

ప్రేమికుల పెళ్లి
అనంతరం సైదాబాదులోని ఆర్య సమాజ్‌లో దుర్గేష్, మౌనికలు సోమవారం సాయంత్రం పూట వివాహం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications