హైదరాబాదులో సెర్చ్ ఆపరేషన్ ఇలా.. (పిక్చర్స్)
హైదరాబాద్: పోలీసులు రికార్డులు తిరగేస్తూ... నేరగాళ్లు ఉన్న డెన్‌లపై కార్డన్ ఉపయోగిస్తున్నారు. ఈ ఆపరేషన్ వల్ల మంచి ఫలితాలు వస్తుండడంతో నేరగాళ్లు ఉండే కాలనీల్లో పోలీసులు అర్ధరాత్రి తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజా గా పశ్చిమ మండలం పోలీసులు స్నాచింగ్ గ్యాంగ్‌లు, జేబుదొంగలు ఎక్కువగా ఉండే అఫ్జల్‌సాగర్ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో రౌడీషీటర్లను పోలీసులు అరెస్టు చేశారు.
వీరితోపాటు మరో 30-35 మంది పై హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్లు ఉన్నాయి. పశ్చిమ మండలం ఉప కమిషనర్ వెలివెల సత్యనారాయణ నేతృత్వంలో జరిగిన కార్డన్‌సెర్చ్ ఆపరేషన్‌లో 35 పోలీసులు బృందాలు పాల్గొన్నాయి.

మొత్తం 45 మంది పురుషులు, 13 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేని బంగారు, వెండి ఆభరణాలు, ఆరు బైక్‌లు, 20 సెల్ ఫోన్లు, రెండు మోటారు పంప్‌లు, 69 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు బాల నేరస్థులను అరెస్టు చేశారు. వీరంతా హబీబ్ నగర్‌లో జంట హత్య కేసులో నిందితులు.













Click it and Unblock the Notifications