కార్డాన్ సెర్చ్: గంటలు శ్రమించి, జాఫర్‌ను పట్టుకున్నారు (పిక్చర్స్)
హైదరాబాద్: అక్రమంగా, అడ్డదారిలో ఎక్కువ డబ్బు సంపాదించేందుకు గుట్టుచప్పుడు కాకుండా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న వారి పైన పోలీసులు ఉక్కుపాదం మోపారు. రెండురోజుల క్రితం ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో జావెద్ అనే ప్రింటింగ్ ప్రెస్ యజమానిపై కత్తులతో దాడి చేసి హత్య చేసిన ఘటనతో వడ్డీ వ్యాపారంపై పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. దీంతో పోలీసులు పాతబస్తీలో వడ్డీ వ్యాపారులపై ఉచ్చు మరింత బిగించారు.
సౌత్ జోన్ పరిధిలో లైసెన్సుల్లేకుండా, నిబంధనలకు విరుద్దంగా చాలామంది ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. సమాచారం సేకరించిన పోలీసులు గురువారం 18 బృందాలుగా విడిపోయి వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి, 30 మంది వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు.
వీరిలో నూటికి 15 నుంచి ఇరవై శాతం వడ్డీ దందా నడిపిస్తున్న రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాకుత్‌పురాలో నివాసముండే జాఫర్ పహిల్వాన్‌ను అదుపులోకి తీసుకునేందుకు, ఆయన ఇంటిని సోదా చేసేందుకు గురువారం వచ్చిన పోలీసులకు ఆయన సహకరించలేదు. పోలీసులను చూసి ఇంటికి తాళం వేసుకోవటం, ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించటంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.

జాఫర్
పోలీసులు లోపలకు రాకుండా జాఫర్ పహిల్వాన్, అతని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఆరుగురు ఇన్స్‌పెక్టర్లు, ఓ ఏసీపీ స్థాయి అధికారి కూడా తమకు సహకరించాలని కోరినా జాఫర్ పహిల్వాన్ విన్పించుకోలేదు. ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సుమారు మూడు నుంచి నాలుగు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది.

జాఫర్
అయినా ఫలితం దక్కకపోవటంతో రంగంలో దిగిన టాస్క్ఫోర్సు పోలీసులు తలుపులు తొలగించేందుకు పోలీసులు గునపాలు తీసుకువచ్చారు.

జాఫర్
దీంతో వెనక్కి తగిన జాఫర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇరుగుపొరుగు వారు జాఫర్‌ను అదుపులోకి తీసుకోవటాన్ని అడ్డుకునేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు.

జాఫర్
ఆ తర్వాత జాఫర్ ఇంటిని కూడా సోదా చేశారు. ఆయనతో పాటు చోటా మహ్మద్ పహిల్వాన్, సలాం పహిల్వాన్‌ల ఇళ్లపై దాడి చేసిన పోలీసులకు వారిలో ఒకరు చిక్కినట్లు, మరొకరు పరారైనట్టు సమాచారం. సాయంత్రం వరకు దాడులు, సోదాలు నిర్వహించిన పోలీసులు పలువురు వడ్డీవ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు.

జాఫర్
దాడులు నిర్వహిస్తున్నపుడు, ఇళ్లను సోదాలు చేస్తున్నపుడు పోలీసులకు అడుగడుగున అడ్డంకులెదురయ్యాయి. అయినా మరికొందర్ని అదుపులోకి తీసుకోవల్సిన ఉన్నట్లు పలువురు పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications