బాబుపై ఫైర్, ఛత్తీస్‌గఢ్‌లో కేసీఆర్ ఇలా(పిక్చర్స్)

హైదరాబాద్: మల్కాజిగిరిలో రూ.334 కోట్ల పురపాలక అభివృద్ధి నిధులతో నిర్మించనున్న తాగునీటి పథకానికి ఆదివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బండారం తాము బయటపెడతామని, అవసరమైతే విజయవాడలో తెరాస తరఫున ఓ సభను పెట్టి ఆంధ్రా సామాన్య రైతులు, పేదల పక్షాన కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ అన్నారు.

 కేసీఆర్

కేసీఆర్

తాను ఎన్నికల ప్రచారం సమయంలో మూడేళ్లు విద్యుత్ కష్టాలు ఉంటాయని చెప్పాని తెలిపారు. విద్యుత్ విషయంలో తాను ఎప్పుడు అబద్దాలు చెప్పలేదన్నారు. మా ప్రజాప్రతినిధులు బ్రహ్మాండంగా పని చేస్తున్నారన్నారు.

కేసీఆర్

కేసీఆర్

పనికిమాలిన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మాటలు నమ్మవద్దన్నారు. ఆరు నూరైనా తాము పేదల పక్షాననే ఉంటామన్నారు. అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని చెప్పారు.

 కేసీఆర్

కేసీఆర్

చివరకు తన నియోజకవర్గంలోను తాను ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదని కేసీఆర్ చెప్పారు. తనకు ధైర్యం ఉంది కాబట్టే ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వలేదని, విద్యుత్ కష్టాలు ఉంటాయని చెప్పానన్నారు. చంద్రబాబు తన రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ఆరోపించారు.

కేసీఆర్

కేసీఆర్

ఆయనలా తాను దొంగమాటలు చెప్పలేదన్నారు. నా తాత జేజమ్మ దిగి వచ్చినా విద్యుత్ సమస్య తీర్చలేరన్నారు. కాంగ్రెస్, టీడీపీల నుండి వారసత్వంగా వచ్చిన ఈ దరిద్రం విద్యుత్ సమస్య అన్నారు.

కేసీఆర్

కేసీఆర్

ఇంకా ఆ పార్టీల నేతలు బస్సుయాత్రలు చేయడం విడ్డూరమన్నారు. కృష్ణా బోర్డు తీర్పును మెడమీద తలకాయ ఉన్న వారు ఎవరు సమర్థించరన్నారు.

కేసీఆర్

కేసీఆర్

అసెంబ్లీ సమావేశాలు ముగియగానే జంట నగరాలలో పక్కా ఇల్లు, నల్లాలను నగరవాసులకు ఇచ్చే కార్యక్రమం చేపడతామన్నారు. నాలుగేళ్లలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇస్తామన్నారు. ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇవ్వకపోతే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు.

ఛత్తీస్‌గఢ్‌లో కేసీఆర్‌కు స్వాగతం

ఛత్తీస్‌గఢ్‌లో కేసీఆర్‌కు స్వాగతం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రాయపూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న దృశ్యం.

ఛత్తీస్‌గఢ్‌లో కేసీఆర్‌కు స్వాగతం

ఛత్తీస్‌గఢ్‌లో కేసీఆర్‌కు స్వాగతం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రాయపూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న దృశ్యం.

ఛత్తీస్‌గఢ్‌లో కేసీఆర్‌కు స్వాగతం

ఛత్తీస్‌గఢ్‌లో కేసీఆర్‌కు స్వాగతం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రాయపూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న దృశ్యం.

ఛత్తీస్‌గఢ్‌లో కేసీఆర్

ఛత్తీస్‌గఢ్‌లో కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రాయపూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అనంతరం బేమెత్ర జిల్లా కోహెడ గ్రామానికి వచ్చిన కేసీఆర్‌కు స్వాగత ఫ్లెక్సీలు కట్టిన రైతుల దృశ్యం.

ఛత్తీస్‌గఢ్‌లో కేసీఆర్

ఛత్తీస్‌గఢ్‌లో కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రాయపూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అనంతరం కోహెడలో మాట్లాడుతున్న కేసీఆర్.

ఛత్తీస్‌గఢ్‌లో కేసీఆర్‌కు స్వాగతం

ఛత్తీస్‌గఢ్‌లో కేసీఆర్‌కు స్వాగతం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రాయపూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ కోహెడకు వెళ్లారు. అక్కడ రైతులతో మాట్లాడారు.

ఛత్తీస్‌గఢ్‌లో కేసీఆర్‌కు స్వాగతం

ఛత్తీస్‌గఢ్‌లో కేసీఆర్‌కు స్వాగతం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రాయపూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ కోహెడకు వెళ్లారు. అక్కడ రైతులతో మాట్లాడారు.

సమైక్య రాష్ట్రంలో జీహెచ్ఎంసీలో అనాథలుగా బతికామన్నారు. హైదరాబాదు నీటి వ్యవస్థను గత ప్రభుత్వాలు సర్వనాశనం చేశాయన్నారు. మాటలు చెప్పడం కాదని, వాస్తవాలు చర్చించేందుకు తాము సిద్ధమన్నారు.

చిన్న వర్షానికే గవర్నర్, ముఖ్యమంత్రి నివాసాల వద్ద నీరు వస్తోందని ఎద్దేవా చేశారు. నాలా భూముల కబ్జడాతో రహదారుల పైన నీరు చేరుతోందన్నారు. తెలంగాణకు విద్యుత్ రాకుండా చేసింది చంద్రబాబేనని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+