కార్ల దొంగలు: నకిలీ పత్రాలతో బురిడీ (పిక్చర్స్)
హైదరాబాద్: వ్యాపారంలో నష్టపోయిన ఓ కారు యజమాని అడ్డదారిలో వెళ్లాడు. మారుపేర్లు, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బ్యాంకులో రుణాలు తీసుకుంటూ పలు మోసాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
నలుగురు నిందితులను అరెస్టు చేయగా ఫోర్జరీ సూత్రధారి ఒకరు పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి 82.5 లక్షల విలువ చేసే కార్లను స్వాధీనం చేసుకున్నారు. శనివారం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో డీసీపీ లింబారెడ్డి వివరాలు వెల్లడించారు.
బేగంపేట రసూల్‌పుర బీహెచ్‌ఎల్ కాలనీకి చెందిన సోహాలిఖాన్ ట్రావెల్ ఏజెన్సీ వ్యాపారి. వ్యాపారంలో నష్టపోయిన అతడు అడ్డదారిలో లక్షలు సంపాదించాలనుకున్నాడు.

నకిలీ పత్రాలతో..
తన పేరుతో ఉన్న కార్లకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కొన్ని బ్యాంకుల్లో రుణాలు తీసుకొనేవాడు. అతడికి దగ్గరి సన్నిహితుడైన సికింద్రాబాద్ సైనిక్‌పురి డిఫెన్స్ కాలనీకి చెందిన సాయినాథ్ కార్లకు ఫైనాన్స్ చేస్తాడు.

నకిలీ పత్రాలతో..
సోహాలిఖాన్ వద్ద ఉన్న కార్లకు సంబంధించి జిరాక్స్‌లను సాయినాథ్‌కు ఇచ్చేవాడు. నాగోల్ ఆర్టీఏ కార్యాలయంలో బ్రోకర్‌గా పని చేస్తున్న అల్వాల్‌కు చెందిన అనిల్.. సాయినాథ్ స్నేహితుడు.

నకిలీ పత్రాలతో..
అతడు ఆర్టీఏ కార్యాలయంలో ఆర్‌సీ కార్డులు, ఎన్‌ఓసీ, నకిలీ ఐడీ కార్డులు, కంప్యూటర్ల, స్కానర్లు, ఇతర సామాగ్రి ద్వారా నకిలీ డాక్యుమెంట్లను సృష్టించేవాడు.

నకిలీ పత్రాలతో..
సోహెల్‌ఖాన్, సాయినాథ్ కలిసి కార్లకు నకిలీ డాక్యూమెంట్లు సృష్టించి మారుపేర్లతో హెచ్‌డీఎఫ్‌సీ, జ్ణానీ బ్యాంకు, టీవీఎస్, సీబీ ఫైనాన్స్ బ్యాంకులో పెట్టి కార్లపై రుణాలు తీసుకున్నారు. టీవీఎస్ ఫైనాన్స్ సంస్థ సోహేల్‌ఖాన్ తన బ్యాంకులో రుణం తీసుకున్న డాక్యుమెంట్లు ఫోర్జరీ అని తేల్చడంతో బ్యాంకు అధికారులు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నకిలీ పత్రాలతో..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. సోహేలిఖాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా నిజం ఒప్పుకున్నాడు.

నకిలీ పత్రాలతో..
ఈ ఫోర్జరీ కేసులో పూర్తి సహకారాలు అందిస్తున్న బహుదూర్‌పురకు చెందిన బిర్జా ఆఫ్సర్, చర్లపల్లికి చెందిన కోటేశ్వర్‌రావు పాత్ర ఉండడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరు ఉపయోగించిన ఎలక్ర్టానిక్ యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications