Pic talk: టీఆర్ఎస్ టు కాంగ్రెస్..వయా టీడీపీ: సింగిల్ ఫ్రేమ్‌లో రేవంత్ పొలిటికల్ జర్నీ
హైదరాబాద్: ఇంకాస్సేపట్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేతగా రేవంత్ రెడ్డి.. బాధ్యతలను స్వీకరించబోతోన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు సీనియర్లు హాజరు కాబోతోన్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ కాంగ్రెస్‌లో చోటు చేసుకున్న అతి కీలక పరిమాణం కావడం వల్ల రాజకీయంగా ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఏర్పడింది. రేవంత్ రెడ్డి నియామకాన్ని తొలుత తీవ్రంగా వ్యతిరేకించిన సీనియర్లు సైతం ప్రస్తుతం మెత్తబడ్డారు..మెట్టు దిగారు. ఆయన నాయకత్వాన్ని అంగీకరిస్తోన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మొదలుకుని పలువురు పార్టీ సీనియర్ నేతలు ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు.

సీనియర్లు వ్యతిరేకించడానికి కారణం ఇదీ..
కాంగ్రెస్ పార్టీ సీనియర్లు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అంత త్వరగా అంగీకరించకపోవడానికి కారణాలు లేకపోలేదు. ఆయన అసలు సిసలు కాంగ్రెస్‌వాది కాదని వాదిస్తోన్నారు. దాదాపు అన్ని పార్టీలనూ ఫిరాయించి వచ్చిన నేతకు పీసీసీ అధినేత వంటి అత్యంత కీలకమైన పదవిని కట్టబెట్టడం సరికాదని చెబుతోన్నారు. ఈ ఒక్క కారణంతోనే తాము రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అంగీకరించట్లేదంటూ ఇదివరకే కొందరు సీనియర్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి లేఖలు సైతం రాశారు. అయిప్పటికీ- ఆయన నియామకాన్ని అడ్డుకోలేకపోయారు. పైగా- పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో అయిష్టంగానే ఆయన వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది.

టీఆర్ఎస్‌లో క్రియాశీలక నేతగా..
కాగా- రేవంత్ రెడ్డి పొలిటికల్ జర్నీకి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. వైరల్‌గా మారింది. సింగిల్ ఫ్రేమ్‌లో రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణానికి సంబంధించిన ఫొటోను ఇమిడ్చారు. దీని ప్రకారం చూసుకుంటే- ఆయన రాజకీయ ప్రస్థానం తెలంగాణ రాష్ట్ర సమితితోనే ఆరంభమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇప్పటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు టీఆర్ఎస్‌ను నెలకొల్పిన తొలి రోజుల్లో రేవంత్ రెడ్డి క్రియాశీలక నాయకుడిగా గుర్తింపు పొందారు. మహబూబ్ నగర్ జిల్లాకు కేసీఆర్ రాకను స్వాగతిస్తూ అప్పట్లోనే బ్యానర్లను కట్టించారు రేవంత్ రెడ్డి. అప్పట్లో కల్వకుర్తి నియోజకవర్గంలో కొనసాగారాయన. కేసీఆర్ పాలమూరు ప్రజాగర్జనను విజయవంతం చేయాలని కోరుతూ ముద్రించిన బ్యానర్‌లో రేవంత్ రెడ్డి ఫొటో ప్రధానంగా కనిపిస్తుంది.

టీడీపీ తీర్థం..
ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. పసుపుకండువాను కప్పుకొన్నారు. టీడీపీలో ఫైర్‌బ్రాండ్ నేతగా గుర్తింపు పొందారు. కొడంగల్ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మార్చేశారు. 2009లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభంజనాన్ని సైతం తట్టుకుని నిలిచారు. కొండగల్ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. తొలుత ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. అనంతరం శాసనసభకు ఎన్నికయ్యారు. 2014లో ప్రత్యేక రాష్ట్రావిర్భావం తరువాత కూడా టీఆర్ఎస్‌కు ఎదురు నిలిచి గెలిచారు.

కాంగ్రెస్‌లో అత్యున్నత స్థానానికి..
2018 మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోయారు. హ్యాట్రిక్ విజయాలను అందుకోలేకపోయారు. కొడంగల్‌లో రేవంత్ రెడ్డి జైత్రయాత్రను టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి అడ్డుకున్నారు. పరాజయం పాలైన తరువాత అతి కొద్దిరోజుల్లోనే టీడీపీకి గుడ్‌బై చెప్పారు. కాంగ్రెస్ కండువాను కప్పుకొన్నారు. ఆ మరుసటి ఏడాదే నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. క్రమంగా పీసీసీ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించగలిగారు.
Recommended Video

బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘంలో..
టీఆర్ఎస్‌లో చేరడానికి ముందే- అఖిల భారత విద్యార్థి పరిషత్‌లో క్రియాశీలక నాయకుడిగా పనిచేశారు. భారతీయ జనతా పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఇది. ఆ రకంగా బీజేపీ భావజాలం కూడా రేవంత్ రెడ్డిలో కనిపిస్తుందని చెబుతుంటారు సన్నిహితులు. ఈ రకంగా చూస్తే- తెలంగాణలో ప్రస్తుతం మనుగడలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల్లోనూ రేవంత్ రెడ్డి అడుగులు పడ్డాయనే చెప్పుకోవచ్చు. చివరికి- తెలంగాణ కాంగ్రెస్‌లో అత్యున్నత పీఠాన్ని అందుకోగలిగే స్థాయికి చేరుకున్నారాయన. దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications