దళిత విద్యార్థి ఆత్మహత్య: ఓయు, హెచ్‌సియూల్లో ఆందోళనలు (పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సియు)లో దళిత పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా సోమవారంనాడు ఆందోళనలు పెల్లుబుకాయి. హైదరాబాదులోని హెచ్‌సియులోనే కాకుండా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా విద్యార్థులు ఆందోళనకు దిగారు.
వారికి మద్దతు తెలపడానికి వచ్చిన సామాజిక కార్యకర్తలు విమలక్క, గీతాంజలి భారతి వంటివారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హెచ్‌సియులో తీవ్ర ఉద్రిక్తత చొటు చేసుకుంది. హైదరాబాదులోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో దళిత సంఘాలు ర్యాలీ నిర్వహించాయి.
రోహిత్ ఆత్మహత్యకు నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. రోహిత్ సూసైడ్ నోట్‌ను పోస్టు చేసి తమ స్పందనను రాశారు. హెచ్‌సియులో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రోహిత్ ఆత్మహత్యను వ్యవస్థ హత్యగా వారు అభివర్ణించారు.

రోహిత్ ఆత్మహత్యపై ఆందోళన
దళిత పరిశోధక విద్యార్థి ఆత్మహత్యపై విశ్వవిద్యాలయ అధికారులను, ఎన్డీయె ప్రభుత్వాన్ని తప్పు పడుతూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

రోహిత్ ఆత్మహత్యపై ఆందోళన
రోహిత్ ఆత్మహత్యకు ఎన్డియె ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రి దత్తాత్రేయను తప్పుపడుతూ విద్యార్థులు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

రోహిత్ ఆత్మహత్యపై ఆందోళన
రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో అతని తల్లికి సంఘీభావం తెలపడానికి వచ్చిన మహిళా కార్యకర్తలు విమలక్క, గీతాంజలి భారతిలను పోలీసులు అడ్డుకున్నారు.

రోహిత్ ఆత్మహత్యపై ఆందోళన
రోహిత్ ఆత్మహత్య హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని దళిత విద్యార్థులను తీవ్రంగా కలచి వేసింది. వారు తమకు న్యాయం జరగాలంటూ డిమాండ్ చేశారు.

రోహిత్ ఆత్మహత్యపై ఆందోళన
రోహిత్ ఆత్మహత్యకు కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హెచ్‌సియులో విద్యార్థులు ఆందోళనకు దిగారు.

రోహిత్ ఆత్మహత్యపై ఆందోళన
రోహిత్ ఆత్మహత్యపై విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌ను తప్పు పడుతూ హెచ్‌సియు విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

రోహిత్ ఆత్మహత్యపై ఆందోళన
రోహిత్ ఆత్మహత్య ప్రకంపనలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనూ వినిపించాయి. ఓయు విద్యార్థులు ఆందోళనకు దిగారు.

రోహిత్ ఆత్మహత్యపై ఆందోళన
దళిత పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఓయు విద్యార్థులు ఆందోళనకు దిగారు.












Click it and Unblock the Notifications