పాతబస్తీ దాడిలో గాయపడిన ఎంబిటి అభ్యర్థి అమ్జాద్ ఇతనే (ఫొటో)

హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే బలాల, అతడి అనుచరులు తనపై అకారణంగా దాడిచేశారని అక్బర్‌బాగ్ డివిజన్ ఎంబీటీ అభ్యర్థి అమ్జదుల్లా ఖాన్ ఆరోపించారు. మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే, అతడి అనుచరులు పది నిమిషాల పాటు తనపై దాడి చేస్తుండగా అక్కడే ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది ప్రేక్షక పాత్ర వహించారని ఆయన ఆరోపించారు.

Picture: The injured MBT candidate Amjad

తనపై దాడిచేసిన ఎమ్మెల్యే బలాలను అరెస్టు చేసేంతవరకు అక్కడి నుంచి కదిలేది లేదని మలక్‌పేట జూనియర్ కాలేజీ వద్ద రోడ్డుపై భీష్మించుకుని ధర్నాకు దిగారు. దీంతో ఈస్ట్ జోన్ టాస్క్‌పోర్ట్ డీసీపీ కోటిరెడ్డి, మలక్‌పేట ఏసీపీ తదితర అధికారులు, స్ట్రైకింగ్ ఫోర్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇంతలో అమ్జదుల్లా ఖాన్ అనుచరులు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Picture: The injured MBT candidate Amjad

పోలీసులు లాఠీఛార్జి చేసి అక్కడ పరిస్థితిని చక్కదిద్దారు. అమ్జదుల్లాఖాన్‌ను చికిత్స నిమిత్తం మలక్‌పేట యశోద ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేస్తామని ఎమ్మెల్యే బలాలను అదుపులోకి తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్ గంగిరెడ్డి తెలిపారు.

ఆ త ర్వాత మజ్లీస్ శాసనసభ్యుడు బలాలను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీపై కూడా బలాల, ఆయన అనుచురులు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+