అసెంబ్లీ వద్ద బందోబస్తు, నిషేధాజ్ఞలు (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. ఐదు నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు జరుగనున్న దృష్ట్యా భద్రతపై పోలీసు శాఖ కసరత్తు పూర్తి చేసింది. అసెంబ్లీ ప్రాంగణాల చుట్టూ రెండు కిలో మీటర్ల మేర నిషేధాజ్ఞలు విధించింది.
ఇద్దరు ఎస్పీలు, ఐదుగురు అదనపు ఎస్పీలు, 20 మంది డిఎస్పీలు, 45 మంది సిఐలు, 200 మంది ఎస్‌ఐలు, 100 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 500 మంది కానిస్టేబుళ్లు, 100 మంది మహిళా కానిస్టేబుళ్లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనుంది.
ఐదు నుంచి 12 వరకు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకుండా నిషేధం విధిస్తూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రేపటి నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే.

పోలీసు బందోబస్తు
తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో శాసనసభ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముందస్తు కసరత్తుగా ఇలా..

పోలీసు బందోబస్తు
తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో శాసనసభ వద్ద భారీ పోలీసు బందోబస్తును, ముందస్తు భద్రతా చర్యలను చేపట్టారు.

పోలీసు బందోబస్తు
తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో శాసనసభ వద్ద ఇలా బారికేడ్లను ఏర్పాటు చేశారు. భారీగా భద్రతా చర్యలు చేపడుతున్నారు.

పోలీసు బందోబస్తు
తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పోలీసులు అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టారు. తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications