కెటిఆర్‌కు త్రీడీ తెర మొబైల్: టీలో కెడిఎక్స్ పెట్టుబడులు
హైదరాబాద్: ప్రముఖ చైనా ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ కేడీఎక్స్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ తెలంగాణలో కళ్లద్దాలు లేకుండా చూసే త్రీడీ తెరలు, టీవీలు, సెల్‌ఫోన్లు ఉత్పత్తి చేస్తుంది.
ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్, పురపాలక మంత్రి కెటి రామారావుతో హైదరాబాదులోని బేగంపేటలో గల ముఖ్యమంత్రి నివాసంలో శుక్రవారం సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. కేడీఎక్స్ సంస్థ చైనా దేశంలో స్టాక్‌మార్కెట్‌లో లిస్ట్ అయిన ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ. మొబైల్‌ఫోన్లు, ట్యాబెట్ల తయారీ రంగంలో కూడా కేడీఎక్స్ ప్రఖ్యాతి వహించిదని చెప్పారు,
తమ సంస్థ ఫిలిప్స్, డాల్బీ 3డీ వంటి ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలతోనూ కలిసి పనిచేస్తున్నదని వివరించారు. నిరుడు తమ సంస్థ 1.2 బిలియన్ డాలర్ల రెవెన్యూని సాధించిందని, గ్రూప్ విస్తరణలో భాగంగా తెలంగాణపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు. మంత్రితో సమావేశానంతరం సంస్థ ప్రతినిధులు హైదరాబాద్ నగరంలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు.
ప్రపంచంలోనే తొలిసారి త్రీడీ తెరతో మొబైల్ తయారుచేస్తున్నామన్న కేడీఎక్స్ సంస్థ ప్రతినిధులు మంత్రికి తమ మొబైల్ ఫోన్ బహూకరించారు. అది ఇంకా మార్కెట్లోకి విడుదల కాలేదు. అందులో ఉన్న త్రీడీ వీడియోలను ఎలాంటి కళ్లద్దాలు లేకుండానే చూడొచ్చని వివరించారు.
కేడీఎక్స్ సంస్థ రూపొందించిన మొబైల్‌ను వీక్షించిన మంత్రి వారి నూతన ఉత్పత్తి విజయవంతం అవుతుందని, ఇలాంటి వినూత్న రంగాల్లో పెట్టుబడులు పెట్టే కేడీఎక్స్ సంస్థకు తమ ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలుంటాయని హమీ ఇచ్చారు. సమావేశంలో టీఎస్‌ఐఐసీ వీసీ, ఎండీ నర్సింహారెడ్డి, ఐటీ శాఖ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజయ్ పాల్గొన్నారు.

అవి కూడా...
కేడీఎక్స్‌తోపాటు ఎంఓయూలో భాగస్వామి అయిన ఎరిస్ ఎపికా గ్రూప్‌కు 15 దేశాల్లో 45 కంపెనీలున్నాయని చెప్పారు. కేడీఎక్స్-ఎరిస్ ఎపికా భాగస్వామ్య సంస్థ తెలంగాణలో అందుబాటులో ఉన్న నిఫుణులు, ఐటీ పరిశ్రమ ముఖ్యంగా కనెక్టివిటి సౌకర్యాల నేపథ్యంలో హైదరాబాద్ నగరాన్ని పెట్టుబడులకి ఎంచుకున్నట్లు కెడిఎక్స్ ప్రతినిధులు తెలిపారు.

నమ్మకం వ్యక్తం చేసిన ప్రతినిధులు
తెలంగాణ పారిశ్రామిక విధానం, ఐటీ పార్కులు, ఐటీ సెజ్‌లు సైతం తమ భవిష్యత్ పెట్టుబడులకి ఊతం ఇస్తాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణలో అద్దాలులేని 3డీ తెరలు, మొబైల్‌ఫోన్లు, టీవీ వంటి ఎలక్ట్రానిక్ గృహోపకరణాలను తయారు చేయనున్నట్లు కేడీఎక్స్- ఎరిస్ ఎపికా సంస్థ ఒప్పందంలో పేర్కొన్నారు.

పూర్తిగా సహకరిస్తాం..
కెడిఎక్స్ - ఎరిస్ ఎపికా సంస్థ ఏర్పాటుకు పూర్తి సహయ సహకారాలు అందించేందుకు సిద్ధమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఎలక్ట్రానిక్స్, గేమింగ్ కంటెట్, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లోని ప్రముఖ సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకోవడంపై మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తంచేశారు.

చాలా కంపెనీలు
తెలంగాణ ప్రభుత్వ పాలన, పారిశ్రామిక విధానం వల్ంల అనేక అంతర్జాతీయస్థాయి కంపెనీలు నగరానికి వస్తున్నాయని, ఇదే వరుసలో కేడీఎక్స్ సంస్థ తెలంగాణపై ఆసక్తి చూపిస్తున్నదని కెటిఆర్ చెప్పారు. తమ పభుత్వం ప్రత్యేక మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నదని, దేశంలోనే అత్యుత్తమ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications