క్రికెట్ బంతి బాలుడి గుండెకు తగిలి... (ఫొటోలు)
హైదరాబాద్: క్రికెట్ సరదా ఓ బాలుడి ప్రాణాలు తీసింది. క్రికెట్ బంతి దెబ్బకు ముక్కు పచ్చలారని బాలుడు మృత్యువాత పడ్డాడు. బ్యాట్‌తో కొట్టిన బంతి నేరుగా గుండెకు తగలడంతో ఆరేళ్ల బాలుడి ప్రాణాలు గాలిలో కలిశాయి.
హైదరాబాదులోని వనస్థలిపురంలో ఈ సంఘటన జరిగింది. వనస్థలిపురం పోలీసులు ఆ వివరాలు అందించారు. ప్రకారం ప్రకాశం జిల్లా కొనిజెడు గ్రామానికి చెందిన టి.గోవింద్‌రాజు, అనిత దంపతులు నగరానికి వలసవచ్చి సహారా ఎస్టేట్‌లోని వింద్వాని అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటూ తాపీ పనిచేసుకుంటూ జీవిస్తున్నారు.
ఆ దంపతులకి వంశీకృష్ణ(6), తేజశ్రీ(4), సాత్విక్(11 నెలలు) పిల్లలు ఉన్నారు. మన్సురాబాద్ నాగార్జున పాఠశాలలో వంశీకృష్ణ యుకెజి చదువుతున్నాడు.

స్నేహితులతో కలిసి..
స్కూల్‌కు సెలువులు రావడంతో గురువారం సాయంత్రం తన స్నేహితులు భవదీప్, సాయిచంద్ర, కార్తిక్, ప్రణయ్‌తో కలిసి గాంధారి అపార్ట్‌మెంట్ పార్కింగ్ స్థలంలో హాట్ టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడుకుంటున్నారు.

సిక్సర్ కొట్టాడు...
పక్కన ఉంటున్న 7వ తరగతి విద్యార్థి విజయ్(14) అక్కడి చేరుకొని బ్యాటింగ్ చేస్తున్నాడు. మొదటి బంతిని సిక్సర్ కొట్టాడు.

రెండో బంతికి ఇలా..
విజయ్ రెండో బంతిని బలంగా కొట్టడంతో ఫీల్డింగ్ చేస్తున్న వంశీకృష్ణ గుండె భాగంలో తాకింది. వంశీకృష్ణ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు.

ఆస్పత్రికి తరలించినా...
వెంటనే ఆసుపత్రికి తరలించగా వంశీకృష్ణ అప్పటికే మృతిచెందాడని వైద్యులు ప్రకటించారు.

కేసు నమోదు...
గురవారం రాత్రి 11 గంటలకు కేసు నమోదు కావడంతో సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
-
బుడ్డోడి ఈ అతి దూకుడు మునిగిపోవడానికేనా? -
విజయవాడ ఉగ్ర కుట్ర కేసు: ఇన్‌స్టా రీల్స్ వెనుక భయంకరమైన కోణం? -
హోటల్ మేనేజ్మెంట్ లో ఆన్ లైన్ శిక్షణ, ఉద్యోగాలు- అర్హతలు..!! -
రోహిత్, శార్దూల్ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు: చిన్ననాటి కోచ్ వీడియో -
Yuvraj Singh:మృత్యువును జయించిన యోధుడు-యువీ ఎమోషనల్ స్టోరీ..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న












Click it and Unblock the Notifications