ఐదుగుర్ని కక్ష గట్టి అన్న కుమారులే చంపారు: ఎందుకు? (పిక్చర్స్)

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా భైంసాలో మంగళవారం ఉదయం జరిగిన ఐదుగురి దారుణ హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. భైంసా పట్టణంలో బార్ ఇమామ్ గల్లీలో నివాసం ఉంటున్న నయామత్‌ఖాన్ కుటుంబానికి తన అన్న కుమారులతో గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలు ఉన్నాయ. ఆ కారణంగానే హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు.

మంగళవారం అన్న కుమారులు శివాజీ చౌక్‌లో పాత ఇనుపసామన్ విక్రయ దుకాణంలో ఉన్న నయామత్‌ఖాన్ (55), యూనిస్‌ఖాన్ (35)లపై కళ్లల్లో కారం చల్లి గొంతుకోసి హత్యచేశారు. ఈ సమయంలో హంతకులను అడ్డుకునే ప్రయత్నం చేసిన షేక్ అమీర్, జబ్బర్‌లకు సైతం గాయాలయ్యాయి.

ఆ తర్వాత పట్టణంలోని బార్ ఇమామ్ గల్లీకి వెళ్లి మృతుడు నయామత్‌ఖాన్ భార్యపై దాడిచేసి దారుణంగా హత్య చేశారు. దాంతో ఆగకుండా ఆపకుండా పట్టణంలోని నయాబాదికి వెళ్లి అక్రమ్‌బి (62), ఆయేషాబేగం (15)లపై విచక్షణా రహితంగా దాడిచేసి పారిపోయారు. స్థానికులు అక్రమ్‌బి, ఆయేబేగంలను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్రమ్‌బి ఆసుపత్రిలో మృతి చెందింది.

ఆస్పత్రికి తరలిస్తుండగా...

ఆస్పత్రికి తరలిస్తుండగా...

ఆయేషాబేగం తలకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో మెరుగైన చికిత్సకై నిజామాబాద్ తరలిస్తుండగా ఆయేషాబేగం సైతం మృతి చెందింది. 2013 నుంచి కొనసాగుతున్న ఆస్తుల తగాదా కారణంగానే ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మృతులతా దగ్గరి కుటుంబ సభ్యులు..

మృతులతా దగ్గరి కుటుంబ సభ్యులు..

మృతులందరూ సమీప కుటుంబ సభ్యులు కాగా హత్యకు పాల్పడ్డ హంతకులు మృతుల అన్నదమ్ముల కుమారులుగా భావిస్తున్నారు. ఒకేరోజు ఏకకాలంలో ఐదు హత్యలు జరగడంతో ఆ ప్రాంతంలో అలజడి రేగింది. పోలీసులు అప్రమత్తమయ్యే లోపే హత్యలు జరగడం తీవ్ర సంచలనం సృష్టించింది.

ఘటన స్థలానికి పోలీసులు...

ఘటన స్థలానికి పోలీసులు...

ఘటన స్థలానికి భైంసా డిఎస్పీ అందె రాములు, నిర్మల్ డిఎస్పీ మనోహర్‌రెడ్డి, ఒఎస్‌డి పనసారెడ్డి, సిఐలు పురుషోత్తంరెడ్డి, వినోద్‌లు చేరుకుని శాంతి భద్రతలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. దోషులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఘటన జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న

అదుపులో శాంతిభద్రతలు

అదుపులో శాంతిభద్రతలు

పట్టణంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని కరీంనగర్ రేంజ్ డిఐజి మల్లారెడ్డి వెల్లడించారు. భైంసా పట్టణంలో మంగళవారం ఐదు హత్యలు జరిగిన నేపథ్యంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో ఘటనా స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన హత్యలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి త్వరలోనే దోషులను పట్టుకుంటామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+