విద్యార్థిని ఆత్మహత్య: తల్లిదండ్రులకు కడుపుకోత, కన్నీరుమున్నీరు (పిక్చర్స్)
హైదరాబాద్: ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య తల్లిదండ్రులకు కడుపుకోతనే మిగిల్చింది. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
హైదరాబాదులోని సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆ సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సరూర్‌నగర్ పరిధిలోని కమలానగర్‌లో నివసించే తుకారంగేట్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన డిటెక్టివ్ ఇనెస్పెక్టర్ అర్జునయ్య కుమార్తె చందన (18) ఆత్మహత్య చేసుకుంది.
చైతన్యపురిలోని నారాయణ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. సోమవారం రాత్రి కుటుంబ సభ్యులందరితో ఎప్పటిలా మెలిగిన చందన భోజనం చేసి పడుకుంది. ఆ తర్వాత తెల్లారేసరికి శవమై కనిపించింది.

ఇంచి ముందు ఇలా..
మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటలకు వారి ఇంటి వైపు వచ్చిన పారిశుద్ధ్య సిబ్బందికి ఇంటిముందు విద్యార్థిని చందన మృతదేహం కనిపించింది. వెంటనే వారు కుటుంబ సభ్యులను లేపి విషయం తెలిపారు.

పై నుంచి దూకి...
ఇంటి పైకప్పు నుంచి దూకి ఇంటర్మీడియట్ విద్యార్థిని చందన ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.
సమాచారం తెలుసుకున్న సరూర్‌నగర్ పొలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

మూడు గంటల ప్రాంతంలో..
అర్జునయ్య కుటుంబం ఆ ఇంటి మొదటి అంతస్తులో నివసిస్తుండగా తెల్లవారుజామున మూడు గంటల తరువాత ఆ ఇంటి రెండవ అంతస్తుకు చేరుకుని చందన తన కళ్లజోడు, స్వెట్టర్ అక్కడపెట్టి పై నుంచి కిందకు దూకి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

తలకు తీవ్రమైన గాయం..
తలకు తీవ్ర గాయం కావడంతో చందన అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదు.

అనుమానాస్పద మృతిగా..
సరూర్‌నగర్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరణానికి కారణాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు.

తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు..
చందన మృతికి తల్లిదండ్రులు బోరున విలపించారు. తమ బిడ్డ ఆత్మహత్యకు గల కారణాలేమిటో తెలియక వారు విలవిలలాడుతున్నారు.

ఒక్కసారిగా...
చందన మృతికి స్థానికులు కూడా తీవ్ర కలవరం చెందారు. స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది.

కటుంబంలో విషాదం..
ఇంటర్మీడియట్ విద్యార్థిని చందన మృతికి కుటుంబంలో విషాద వాతావరణం నెలకొంది. నిండ నూరేళ్లు బతకాల్సిన అమ్మాయి అర్థాంతరంగా తనువు చాలించింది.

తల్లి కడుపుకోత...
తెల్లారేసరికి కూతురు విగతజీవిగా దర్శనం ఇవ్వడంతో తల్లి కడపుకోతను తట్టుకోలేక కన్నీమున్నీరైంది.












Click it and Unblock the Notifications