జర్నలిస్టులు: గన్‌పార్కు వద్ద నివాళులు, కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకరం (పిక్చర్స్)
హైదరాబాద్: దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టులకు, వారి కుటుంబసభ్యుల కోసం నగదు రహిత వైద్యసేవలతో కూడిన హెల్త్‌కార్డులను ఇస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రభుత్వం జీవో జారీ చేయడంతో జర్నలిస్టులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
దేశం చరిత్రలో ఎక్కడా లేనివిధంగా హెల్త్ కార్డులు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. అక్రెడిటేషన్‌తో సంబంధం లేకుండా మీడియాలో పనిచేస్తున్న అందరికీ హెల్త్‌కార్డులు అందజేస్తామని ఆయన చెప్పారు.
జర్నలిస్టుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హెల్త్‌కార్డుల జీవో జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తంచేస్తూ హైదరాబాదులోని గన్‌పార్క్‌లోని అమర వీరుల స్థూపం వద్ద అమరులైన జర్నలిస్ట్‌లకు టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ చిత్రపటానికి జర్నలిస్టులు క్షీరాభిషేకం చేశారు.

జర్నలిస్టుల హర్షాతిరేకాలు...
తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు నగదు రహిత వైద్య కార్డులను ఇస్తూ జీవో జారీ చేయడం పట్ల జర్నలిస్టులు సంబరాలు చేసుకున్నారు.

పదికోట్ల రూపాయల నిధి
జర్నలిస్టుల సంక్షేమం కోసం పది కోట్ల రూపాయలతో నిధిని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చెప్పారు. పత్రికా యాజమాన్యాల నుంచి రెండు శాతం ఫండ్‌ను నిధికి సమకూర్చడం అభినందనీయమన్నారు.

ఇళ్ల స్థలాలకు విజ్ఞప్తి
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు ఇవ్వడంలో చొరవచూపిన మంత్రులు కేటీఆర్, లకా్ష్మరెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

బాబు అహంకార ధోరణిపై అల్లం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అహంకార ధోరణితో తెలంగాణ ప్రజలపై వ్యాఖ్యలు చేయడాన్ని అల్లం నారాయణ ఖండించారు.

కార్యక్రమంలో వీరంతా..
కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షుడు పల్లె రవి, ప్రధాన కార్యదర్శి క్రాంతి, హైదరాబాద్ అధ్యక్షుడు యోగానంద్, తెమ్జూ రాష్ట్ర అధ్యక్షుడు రమణ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నగేశ్, కోశాధికారి మురళీసాగర్ పాల్గొన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications