టెక్కీ మృతి: పదో అంతస్థులో చెప్పులు, జేబులో బిల్లు (పిక్చర్స్)
హైదరాబాద్: పది అంతస్తుల భవనంపై నుంచి దూకి గుర్తు తెలియని ఓ టెక్కీ ఆత్మహత్యకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం రాత్రి రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం పోచారం సంస్కృతి టౌన్‌షిప్‌లో చోటు చేసుకుంది.
మృతుడి వివరాలు పూర్తిగా లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడా లేక ఎవరైనా భవనంపై నుంచి తోసి ఉంటారా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మృతుడి జేబులో అదే కాలనీలో ఉన్న ఉషోదయ సూపర్ మార్కెట్‌కు సంబంధించిన బిల్లు పోలీసులకు లభ్యమైంది. మృతుడు నిక్కర్, టీ షర్టు ధరించి ఉన్నాడని, అతడి చెప్పులు సీ-9 బ్లాక్ పదో అంతస్తుపై దొరికాయని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఘట్‌కేసర్ సీఐ ప్రకాశ్‌యాదవ్ సందర్శించారు.

డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి తనిఖీ నిర్వహించారు. మృతుడు ఎవరనే విషయాన్ని శుక్రవారం సాయంత్రం వరకు నిర్ధారించలేకపోయామని పోలీసులు చెప్పారు. చాలా ఎత్తు నుంచి కిందపడటంతో తల పగిలి అక్కడికక్కడే మరణించాడని తెలిపారు. కాలనీ సెక్యూరిటీ గార్డు వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై లింగయ్య తెలిపారు.













Click it and Unblock the Notifications