సాయం చేయండి.. చెన్నకేశవులు భార్య,బిడ్డల కోసం రాంగోపాల్ వర్మ ట్వీట్..

నిర్భయ ఘటన తర్వాత మళ్లీ ఆ స్థాయిలో దేశం మొత్తాన్ని కదిలించిన దిశ సంఘటనలో నిందితుడు చెన్నకేశవులు నేపథ్యం ఎక్కువగా వార్తల్లోకి ఎక్కింది. చెన్నకేశవులు భార్య రేణుక గర్భంతో ఉండటం.. తనను కూడా చంపేయండి అంటూ ఆమె స్టేట్‌మెంట్స్ ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశమైంది. తాజాగా రేణుక ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రేణుకు సాయం చేయాలంటూ ట్వీట్ చేశారు. 'చెన్నకేశవులు భార్య రేణుక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. కానీ రేపిస్టుల నీడ వారిపై పడకుండా ఉండాలంటే.. దయచేసి మీకు తోచిన సాయం చేయండి.'అని ట్విట్టర్‌లో వర్మ పేర్కొన్నారు. యాక్షన్‌ ఎయిడ్‌ ఫర్‌ సొసైటల్‌ అడ్వాన్స్‌మెంట్‌(ఏఏఎస్‌ఏ) అకౌంట్‌ నంబర్‌,వివరాలను కూడా షేర్ చేశారు.

గతంలోనూ రాంగోపాల్ వర్మ రేణుకను ప్రత్యేకంగా కలిసి దిశ ఘటనపై వివరాలు సేకరించిన సంగతి తెలిసిందే. ఆమెతో ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ కూడా చేశారు. కొంత మొత్తం ఆర్థిక సాయం కూడా చేశారు. దిశ ఘటనపై సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఆమెకు బిడ్డ పుట్టడంతో ఆర్థిక సాయం చేయాలంటూ ట్వీట్ చేశారు.

please donate whatever you can for chennakeshavulu wife and daughter says ramgopal varma

కాగా,హైదరాబాద్ శివారులోని షాద్ నగర్ టోల్ గేట్ సమీపంలో వెటర్నరీ వైద్యురాలిపై నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. చటాన్ పల్లి అండర్ పాస్ సమీపంలో ఆమెను హత్య చేసి మృతదేహాన్ని తగలబెట్టారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కదిలించడంతో నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలన్న డిమాండ్ వెల్లువెత్తింది.

Recommended Video

    #DishaAct2019 : AP Women Ministers Celebrates Disha Bill || Oneindia Telugu

    సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా నిందితులను చర్లపల్లి జైలు నుంచి చటాన్‌పల్లికి తీసుకున్న పోలీసులు.. అక్కడ వారు తమపై తిరగబడటంతో ఆత్మరక్షణలో భాగంగా ఎన్‌కౌంటర్ చేశారు. అయితే ఈ ఎన్‌కౌంటర్ బూటకమన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై మానవ హక్కుల కమిషన్ విచారణ కొనసాగుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+