జీహెచ్ఎంసీ ఎన్నికలు: 8 నెలలు గడువు ఇవ్వండి
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు మరో ఎనిమిది నెలలు పాటు వాయిదా వేయించుకునే దిశగా కేసీఆర్ ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఆదివారం వరకు జీహెచ్ఎంసీ ఎన్నికలపై నోరు మెదపని ప్రభుత్వం, హైకోర్టు గట్టిగా స్పందించడంతో ఎట్టకేలకు నోరు విప్పింది.
జీహెచ్ఎంసీ ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసిన కోర్టు, ఈ విషయంపై మరికొద్ది సేపట్లో విచారణ చేపట్టనుంది. ఈ విచారణకు హాజరైన తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి ద్వారా ప్రభుత్వం తన విజ్ఞప్తిని హైకోర్టుకు విన్నవించింది.

గ్రేటర్‌లో పరిధిలో వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారుకు ఎంతలేదన్నా 8 నెలల సమయం పడుతుందని ప్రభుత్వ వాదనను వినిపించింది. కాబట్టి 8 నెలల తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వ వాదనపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూద్దాం.












Click it and Unblock the Notifications