PM Modi Hyderabad Tour:రాష్ట్రం కేంద్రంతో కలిసి రావడం లేదు అందుకే అభివృద్ధి ఆలస్యం అవుతోంది

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాదుకు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఉదయం 11:30 గంటలకు మోదీ ప్రయాణిస్తున్న విమానం ల్యాండ్ అయ్యింది. ప్రధాని మోదీకి గవర్నర్ తమిళిసై, రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రధాని మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు బయలుదేరి వెళ్లారు.హైదరాబాదులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుని ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభిస్తారు.అంతేకాదు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకీకరణ పనులను ప్రధాని ప్రారంభిస్తారు.

 modivandebharath

అనంతరం ప్రధాని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాదు పర్యటన, బహిరంగ సభకు సంబంధించిన పూర్తి వివరాలు మినిట్-టూ-మినిట్ లైవ్‌లో మీకోసం

Apr 08, 2023, 1:31 pm IST

సికింద్రాబాద్ నుంచి ప్రధాని మోదీ తిరుగు ప్రయాణం
Apr 08, 2023, 1:30 pm IST

బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని
Apr 08, 2023, 1:28 pm IST

తెలంగాణ కుటుంబపాలన నుంచి విముక్తి పొందాలి: ప్రధాని మోదీ
Apr 08, 2023, 1:15 pm IST

అవినీతిపరులపై చట్టప్రకారంగా చర్యలు తీసుకోవాలా వద్దా..?
Apr 08, 2023, 1:15 pm IST

నాపై పోరాటానికి అన్ని శక్తులు ఏకమయ్యాయి..అవినీతిపై పోరాటంలో నాతో కలిసి వస్తారా రారా: ప్రధాని మోదీ
Apr 08, 2023, 1:14 pm IST

కొందరి గుప్పిట్లోనే అధికారం మగ్గుతోంది: ప్రధాని మోదీ
Apr 08, 2023, 1:14 pm IST

నిజాయితీగా పనిచేసేవాళ్లంటే ఇక్కడ కొందరికి గిట్టడం లేదు: ప్రధాని మోదీ
Apr 08, 2023, 1:13 pm IST

తెలంగాణలో కుటుంబ పాలనతో అవినీతి ఎక్కువైపోతోంది: ప్రధాని మోదీ
Apr 08, 2023, 1:09 pm IST

రాష్ట్రం కేంద్రంతో కలిసి రావడం లేదు అందుకే అభివృద్ధి ఆలస్యం అవుతోంది: ప్రధాని మోదీ
Apr 08, 2023, 1:08 pm IST

విద్యారంగంలో పెట్టుబడులు పెంచుతున్నాం: ప్రధాని మోదీ
Apr 08, 2023, 1:07 pm IST

కల్వకుర్తి-కొల్లాపూర్ రహదారి పనులు చేపట్టాం: ప్రధాని మోదీ
Apr 08, 2023, 1:05 pm IST

దేశంలో ఏడు టెక్స్‌టైల్ పార్కులు నిర్మిస్తున్నాం. అందులో ఒకటి తెలంగాణలో వస్తుంది: ప్రధాని మోదీ
Apr 08, 2023, 1:02 pm IST

హైదరాబాద్ బెంగళూరు కనెక్టివిటీని అభివృద్ధి చేస్తున్నాం: ప్రధాని మోదీ
Apr 08, 2023, 1:00 pm IST

రూ.11000 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాను: ప్రధాని మోదీ
Apr 08, 2023, 12:59 pm IST

ఎన్డీయే సర్కార్ సబ్కా సాథ్, సబ్కా వికాస్,సబ్కా ప్రయాస్ మంత్రంతో ముందుకు వెళుతోంది: ప్రధాన మోదీ
Apr 08, 2023, 12:56 pm IST

హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మీ ఆలయంను తిరుపతిలోని శ్రీవెంకటేశ్వరస్వామిని అనుసంధానం చేస్తుంది ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు
Apr 08, 2023, 12:56 pm IST

కొద్ది క్షణాల ముందు రెండో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించడం జరిగింది: ప్రధాని మోదీ
Apr 08, 2023, 12:54 pm IST

తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
Apr 08, 2023, 12:51 pm IST

13 ఎంఎంటీఎస్ రైళ్లను వర్చువల్ పద్ధతిలో జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
Apr 08, 2023, 12:49 pm IST

సికింద్రాబాద్ పునురాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ
Apr 08, 2023, 12:44 pm IST

బీబీనగర్ ఎయిమ్స్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ
Apr 08, 2023, 12:41 pm IST

ఐదు జాతీయ రహదారులకు ప్రధాని మోదీ శంకుస్థాపన
Apr 08, 2023, 12:40 pm IST

పలు అభివృద్ధి పనులకు పరేడ్ గ్రౌండ్స్ వేదికపై నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ
Apr 08, 2023, 12:35 pm IST

ఇప్పుడు వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకునేందుకు వందేభారత్‌తో మరింత సులభతరమైంది: రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్
Apr 08, 2023, 12:34 pm IST

వేదికపై నలుగురికి మాత్రమే చోటు. ప్రధాని మోదీతో పాటు గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్‌ రెడ్డిలకు చోటు
Apr 08, 2023, 12:33 pm IST

తెలుగు రాష్ట్రాల్లో ఇది రెండవ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ - రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్
Apr 08, 2023, 12:32 pm IST

మోదీ నినాదాలతో మారుమోగిన సభ
Apr 08, 2023, 12:31 pm IST

ప్రధాని మోదీ సభకు భారీగా హాజరైన ప్రజలు కార్యకర్తలు
Apr 08, 2023, 12:19 pm IST

కాసేపట్లో బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం
Apr 08, 2023, 12:19 pm IST

పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకున్న ప్రధాని మోదీ
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+