సీఎం కేసీఆర్ కు ప్రధాని - గవర్నర్ విషెస్ : సీఎంలు - సినీ ప్రముఖుల ట్వీట్స్..!!

ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రధాని మోదీ, గవర్నర్ తో సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం నేడు. ప్రధాని మోదీ..గవర్నర్ తమిళిసైతో సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు..అనేక రంగాలకు చెందిన ప్రముఖులు ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ప్రధాని మోదీ ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ మేరకు ట్వీట్ చేసారు. గవర్నర్ తమిళిసై ముఖ్యమంత్రికి ట్వీట్ ద్వారా బర్త్ డే విషెస్ తెలిపారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో జీవితం అర్థవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. మెగాస్టార్ చిరంజీవి సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసారు. కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ..ఆయన ఆరోగ్యంగా ఉండాలని పేర్కొన్నారు.

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి సీఎం కేసీఆర్ కు జన్మదిన సందేశం పంపారు. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. జనసేనాని పవన్ కల్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.

అదే విధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ కూడా కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు కేసీఆర్ కు ఆరోగ్యవంతమైన..సుదీర్ఘమైన జీవితాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నారు. పలువురు పార్టీ నేతలు దేవాలయాల్లో పూజలు నిర్వహించారు.

PM Modi and Governor wishes to KCR on his 69th Birthday, CMs and Cine heros Greets BRS President

పార్టీ నేతలు రక్త దాన...అన్న దాన కార్యక్రమాలు నిర్వహించారు. ఏపీలోనూ కేసీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నేతలు నిర్వహించారు. బిఆర్యస్ నాయకుడు... రావెల కిషోర్ బాబు కేక్ కట్ చేసి కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి,సంక్షేమం భారత దేశానికి ఒక నమూనాగా నిలుస్తుందని పేర్కొన్నారు.

అలాంటి అభివృద్ధి దేశ వ్యాప్తంగా ప్రజలకు అందించాలనే బిఆర్ఎస్ ఆవిర్భావం జరిగిందని చెప్పుకొచ్చారు. దేశ వ్యాప్తంగా దళిత భందు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసారు. నూతనం గా నిర్మిస్తున్న భారత పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+