హైదరాబాద్‌లో ప్రధాని మోడీ: ఐఎస్బీలో కీలక ప్రసంగం, బీజేపీ సభలో కుటుంబ పాలనపై ఫైర్: సీఎం కేసీఆర్ గైర్హాజరు

హైదరాబాద్:ప్రధాని నరేంద్ర మోడీ గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‍‌కు వచ్చారు. నగరంలోని బేగంపేట విమానాశ్రయంకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు ప్రధాని మోడీ. గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ) ద్విదశాబ్ది వార్షికోత్సవాన్ని గురువారం ఘనంగా జరుపుకుంటోంది. ఈ వార్షికోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు.అయితే, ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకావడం లేదు. కేసీఆర్ ఈ ఉదయం బెంగళూరుకు వెళ్లారు.

PM Modi in hyderabad live updates in telugu: CM KCR to skip

May 26, 2022, 4:36 pm IST

బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి బయల్దేరి వెళ్లారు ప్రధాని మోడీ.
May 26, 2022, 4:33 pm IST

హెచ్‌సీయూ నుంచి హెలికాప్టర్‌లో బేగంపేట విమానాశ్రయానికి వెళ్లాల్సి ఉండగా.. ఈదురుగాలి, వాన కారణంగా ఏవియేషన్ అధికారులు అనుమతివ్వలేదు. దీంతో రోడ్డు మార్గం ద్వారానే ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు ప్రధాని.
May 26, 2022, 4:07 pm IST

ఐఎస్‌బీలో కార్యక్రమం అనంతరం ప్రధాని మోడీ హెచ్‌సీయూకు వెళ్లారు.
May 26, 2022, 4:07 pm IST

రిఫార్మ్‌, పర్ఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్‌ నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది: ప్రధాని మోడీ
May 26, 2022, 3:52 pm IST

ఇప్పుడు ఇండియా అంటేనే బిజినెస్: ప్రధాని మోడీ
May 26, 2022, 3:51 pm IST

చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎఫ్‌డీలు వచ్చాయి: ప్రధాని మోడీ
May 26, 2022, 3:35 pm IST

యువతకు అండగా మా ప్రభుత్వం నిలబడుతుంది: ప్రధాని మోడీ
May 26, 2022, 3:35 pm IST

కరోనా సమయంలో భారత్ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలిశాయి: ప్రధాని మోడీ
May 26, 2022, 3:32 pm IST

యువత కోసం దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు.
May 26, 2022, 3:29 pm IST

మీరు చేపట్టబోయే కార్యక్రమాలు దేశానికి ఎలా ఉపయోగపడతాయో ఆలోచించండి: విద్యార్థులతో ప్రధాని మోడీ.
May 26, 2022, 3:28 pm IST

మీ వ్యక్తిగత లక్ష్యాలను దేశ లక్ష్యాలతో జోడించాలని విద్యార్థులకు సూచించారు ప్రధాని మోడీ.
May 26, 2022, 3:28 pm IST

మన విధానాలు, నిర్ణయాలను ప్రపంచం మొత్తం అధ్యయనం చేసే పరిస్థితులు వచ్చాయి: ప్రధాని మోడీ
May 26, 2022, 3:27 pm IST

నాకు మీ మీద నమ్మకం ఉంది. మీకు మీపై నమ్మకం ఉందా? అని విద్యార్థులను మోడీ ప్రశ్నించారు.
May 26, 2022, 3:25 pm IST

భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కన్జూమర్ మార్కెట్ అని ప్రధాని తెలిపారు.
May 26, 2022, 3:24 pm IST

2014 తర్వాతే అనేక సంస్కరణలు అమల్లోకి వచ్చాయని అన్నారు ప్రధాని మోడీ. గత మూడు దశాబ్దాల కంటే మెరుగ్గా గత 8 ఏళ్లలోనే దేశం అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు.
May 26, 2022, 3:22 pm IST

జీ-20 దేశాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్‌దే: ప్రధాని మోడీ
May 26, 2022, 3:21 pm IST

ఇంటర్నెట్ వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉందని ప్రధాని మోడీ తెలిపారు.
May 26, 2022, 3:20 pm IST

స్మార్ట్ ఫోన్ల వినియోగంలో భారత్ మొదటి స్థానంలో ఉంది: ప్రధాని మోడీ
May 26, 2022, 3:13 pm IST

ఐఎస్‌బీ విద్యార్థులు అనేక స్టార్టప్‌లు ప్రారంభించారని ప్రధాని తెలిపారు.
May 26, 2022, 3:08 pm IST

ఎంతో మంది కృషి వల్లే ఐఎస్‌బీ ఈ స్థాయికి చేరిందన్నారు.
May 26, 2022, 3:07 pm IST

2001లో అప్పటి ప్రధాని వాజపేయి హైదరాబాద్ ఐఎస్‌బీని ప్రారంభించారని మోడీ గుర్తు చేశారు.
May 26, 2022, 3:06 pm IST

ఐఎస్‌బీ తన ప్రయాణంలో కీలక మైలు రాయికి చేరిందన్నారు.
May 26, 2022, 3:04 pm IST

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(హైదరాబాద్) 20వ వార్షికోత్సవ వేడుకలో ప్రధాని మోడీ ప్రసంగిస్తన్నారు.
May 26, 2022, 2:48 pm IST

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(హైదరాబాద్) 20వ వార్షికోత్సవ వేడుకలకు హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ.
May 26, 2022, 2:47 pm IST

బీజేపీ సభ అనంతరం ప్రధాని మోడీ ఐఎస్‌బీకి బయల్దేరారు.
May 26, 2022, 2:43 pm IST

భారతదేశం 'ఆత్మనిర్భర్ భారత్' కలతో ముందుకు సాగుతోంది: ప్రధాని మోడీ
May 26, 2022, 2:43 pm IST

ఈ ఎనిమిదేళ్లలో వేల స్టార్టప్ లను ప్రోత్సహించామని ప్రధాని మోడీ వివరించారు.
May 26, 2022, 2:30 pm IST

దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా దూసుకెళ్తున్నామన్నారు.
May 26, 2022, 2:30 pm IST

దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతోందన్నారు.
May 26, 2022, 2:24 pm IST

తెలంగాణ ప్రజలు ఎంత సమర్థులో తనకు తెలుసన్నారు.
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+