హైదరాబాద్‌లో మోడీ మెగా రోడ్ షో, హారతులు పట్టారు: గురుద్వారాను సందర్శించిన ప్రధాని
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ నగరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం సాయంత్రం రోడ్ షో నిర్వహించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ప్రారంభమైన రోడ్ షో.. నారాయణగూడ, వైఎంసీఏ, కాచిగూడ చౌరస్తాలోని వీర్ సావర్కర్ విగ్రహం వరకు సాగింది. రెండు కిలోమీటర్ల మేర జరిగిన ఈ రోడ్ షోలో.. ప్రధాని మోడీని చూసేందుకు బీజేపీ, జనసేన, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
తెలంగాణలో తొలిసారి, వస్తుంది బిజెపి సర్కారు.
— BJP (@BJP4India) November 27, 2023
PM Shri @narendramodi's massive roadshow in Hyderabad.#BJPWinningTelangana https://t.co/UOgishGqa6
ప్రధాని నరేంద్ర మోడీని చూసేందుకు భారీగా తరలివచ్చిన మహిళలు మంగళ హారతులు పట్టారు. మోడీపై పూలవర్షం కురిపించారు. దీంతో ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కాచిగూడ వరకు పరిసరాలన్నీ జనసంద్రంగా మారాయి. రోడ్ షోను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ ముందుగానే ఆ రూట్లలో బస్సులను డైవర్ట్ చేసింది. ట్రాఫిక్ పోలీసులు రోడ్ షోకు 2 గంటల ముందుగానే ట్రాఫిక్ నిలిపివేశారు.

#WATCH | Telangana Elections: Prime Minister Narendra Modi begins a roadshow in Hyderabad. pic.twitter.com/VeyF7Q4CxK
— ANI (@ANI) November 27, 2023
హైదరాబాద్ కి ధన్యవాదాలు!నన్ను ఈ నగరం ఎల్లప్పుడూ చాలా స్నేహపూర్వకంగా స్వాగతించింది, ఈ రోజు దానికి మినహాయింపు కాదు. ఈరోజు రోడ్‌షోకి వచ్చిన అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు అని ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో ఈరోజు జరిగిన అద్భుతమైన రోడ్‌షో నుండి మరికొన్ని చిత్రాలు. pic.twitter.com/VYAUG9YelD
— Narendra Modi (@narendramodi) November 27, 2023
మరోవైపు, భద్రతా కారణాల దృష్ట్యా చిక్కడపల్లి, నారాయణగూడ, కాచిగూడ స్టేషన్లలో మెట్రో రైలు ఆగదని మెట్రో అధికారులు ముందుగానే ప్రకటించారు. ఈ కార్యక్రమంతో తెలంగాణలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం ముగిసింది.
హైదరాబాద్ కి ధన్యవాదాలు!నన్ను ఈ నగరం ఎల్లప్పుడూ చాలా స్నేహపూర్వకంగా స్వాగతించింది, ఈ రోజు దానికి మినహాయింపు కాదు. ఈరోజు రోడ్‌షోకి వచ్చిన అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు. pic.twitter.com/9bOO7GaKtb
— Narendra Modi (@narendramodi) November 27, 2023
గురుద్వారాను సందర్శించిన ప్రధాని మోడీ:రోడ్ షో అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ అమీర్‌పేటలోని గురుద్వారాను సందర్శించారు. గురునానక్ జయంతి కావడంతో ప్రధాని మోడీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గురుద్వారా ప్రముఖులు ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధానికి వారు ఖడ్గాన్ని సమర్పించారు. కాసేపు అక్కడే కూర్చుని అక్కడివారితో ముచ్చటించారు.
#WATCH | Prime Minister Narendra Modi visits Ameerpet Gurudwara in Hyderabad, Telangana on the occasion of Guru Nanak Jayanti. pic.twitter.com/CemgksUvW7
— ANI (@ANI) November 27, 2023












Click it and Unblock the Notifications