నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోడీ: వందేభారత్ తోపాటు 11వేల కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ రూ. 11,300 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు శనివారం హైదరాబాద్ రానున్నారు. ఈ క్రమంలో ప్రధాని పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలు, ఎస్పీజీ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. మరోవైపు, బీజేపీ శ్రేణులు ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యాయి. ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా మోడీ తోపాటు బీజేపీ నేతల స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు వెలిశాయి.

కాగా, శనివారం ఉదయం 11.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు ప్రధాని మోడీ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 11.45 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లనున్నారు. అక్కడ సికింద్రాబాద్‌-- తిరుపతి మధ్య నడిచే వందేభారత్‌ ఎక్స్ ప్రెస్‌ను ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. సికింద్రాబాద్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

 PM Modi to visit hyderabad today, to launch Vande Bharat train and other development works

హైదరాబాద్-మహబూబ్‌నగర్ రైల్వే డబ్లింగ్ పనులను ప్రారంభిస్తారు. ఇక ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్‌లో భాగంగా 13 లోకల్ ట్రైన్లను ప్రధాని మోడీ పచ్చజెండా ఊపుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.15 గంటలకు పరేడ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. 12.18 గంటల నుంచి 1.20 గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్ తో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్స వాలు చేస్తారు.
ఐదు జాతీయ రహదారుల పనులను ప్రారంభించడంతోపాటు బీబీనగర్ ఎయిమ్స్ కు సంబంధించిన కొత్త భవనం నిర్మాణానికి భూమి పూజ చేస్తారు.

అనంతరం బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. ఆ తర్వాత 1.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి తిరిగి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు మోడీ. ఇది ఇలావుంటే, శనివారం కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా సీఎం కేసీఆర్‌కు ఇప్పటికే అధికారికంగా ఆహ్వానం పంపారు. పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే సభలో కేసీఆర్ ప్రసంగం కోసం 7 నిమిషాల టైమ్‌ కూడా కేటాయించారు. అయితే ఈసారి కూడా కేసీఆర్ దూరంగానే ఉండాలని నిర్ణయించుకోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని మోడీకి స్వాగతం పలుకుతారు.

ట్రాఫిక్ ఆంక్షలు

ప్రధాని పర్యటన నేపథ్యంలోనే సికింద్రాబాద్ పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు విధిస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. ప్రధాని పర్యటించే మోనప్ప జంక్షన్‌, సీటీఓ జంక్షన్‌, సెయింట్‌ జాన్స్‌ రోటరీ, సంగీత్‌ ఎక్స్‌ రోడ్స్‌, చిలకల గూడ జంక్షన్‌, ఎంజీ రోడ్‌, ఆర్పీ రోడ్‌, ఎస్పీ రోడ్‌ మార్గాల్లో ప్రయాణించేవారు ప్రత్యామ్నాయం చూసుకోవాలని సీపీ ఇప్పటికే సూచించారు. టివోలీ జంక్షన్‌ నుంచి ప్లాజా జంక్షన్‌, ఎస్బీహెచ్‌ ఎక్స్‌రోడ్స్‌ నుంచి స్వీకార్‌ ఉప్‌కార్‌ జంక్షన్‌ మధ్య మార్గాన్ని తాత్కాలికంగా మూసి ఉంచుతారు. కాగా, ప్రధాని తన హైదరాబాద్ పర్యటన గురించి తెలుగులో పలు ట్వీట్లు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+