ఎవరూ చేయనంత గొప్పగా నటన: శ్రీదేవి మృతిపై సీఎం కేసీఆర్, కృష్ణంరాజు
హైదరాబాద్/న్యూఢిల్లీ: సినీ నటి శ్రీదేవి హఠాన్మరణంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీదేవి మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు అన్నారు.
ఆమె మరణం తెలుగు సినిమా అభిమానులకు కూడా లోటు మిగిల్చిందన్నారు. ఎన్నో సినిమాలలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన శ్రీదేవి అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు.

శ్రీదేవి మృతిపై కృష్ణంరాజు
శ్రీదేవి మృతిపై నటుడు, మాజీ ఎంపీ కృష్ణంరాజు స్పందించారు. ఆమె మృతి సినీ పరిశ్రమను షాక్‌కు గురి చేసిందన్నారు. కూతురు భవిష్యత్తును చూడకుండానే వెళ్లిపోవడం బాధాకరమన్నారు. సెట్‌లో హుందాగా, గౌరవంగా వ్యవహరించేవారని చెప్పారు. భారత చిత్ర పరిశ్రమ షాకైందన్నారు.

శ్రీదేవి మృతిపై హేమమాలిని
ఎందరో నటీమణులకు శ్రీదేవి ఆదర్శం అని బీజేపీ ఎంపీ, నటి హేమమాలిని అన్నారు. సినీ జీవితంలో ఆమె చెరగని ముద్ర వేశారన్నారు. శ్రీదేవి జీవితం మొత్తం నటనలోనే సరిపోయిందని చెప్పారు.

ఆమె ఆత్మకు శాంతి కలగాలి
నటి శ్రీదేవి మృతికి కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం తెలిపారు. శ్రీదేవి హఠాత్మరణం తెలిసి షాకయ్యానని చెప్పారు. మరిచిపోలేని ప్రతిభతో ఆమె తన మార్క్ చూపించారన్నారు. ఆమె మృతి సినిమా పరిశ్రమకు పెద్ద లోటు అన్నారు. ఆమె ఆత్మకు శాంతికలగాలన్నారు.

మా ఇంట్లో ఎదిగిన పిల్ల
శ్రీదేవి తమ ఇంట్లో ఎదిగిన పిల్ల అని నటుడు కృష్ణ అన్నారు. చెన్నైలో ఆమెది, తమది పక్క పక్క ఇల్లేనని చెప్పారు. ఆమె మృతికి సంతాపం తెలిపారు. శ్రీదేవి పోషించిన పాత్రల్లో ఎవరూ చేయలేనంత గొప్పగా నటించిందని కృష్ణం రాజు అన్నారు. కాగా శ్రీదేవి మృతికి ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీలు సంతాపం ప్రకటించారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications