మల్కాజిగిరిలో ప్రధాని మోడీ భారీ రోడ్ షో
తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. పదిరోజుల వ్యవధిలోనే మరోసారి తెలంగాణకు వచ్చిన ప్రధాని మోడీ.. నేటి నుంచి మూడురోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రాష్ట్రానికి విచ్చేసిన మోడీకి బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.ఇటీవల మరికొంతమంది బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
శుక్రవారం సాయంత్రం కేరళ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు ప్రధాని మోడీ. అక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గంలో మల్కాజిగిరి చేరుకున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో బీజేపీ విజయాన్ని కాంక్షిస్తూ మోడీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సహా పలువరు బీజేపీ నేతలు పాల్గొన్నారు.

— BJP Telangana (@BJP4Telangana) March 15, 2024
మీర్జాలగూడ నుంచి మల్కాజిగిరి క్రాస్ వరకు దాదాపు 1.2 కిలోమీటర్ల మేర సాగిన భారీ ర్యాలీలో భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అశేష జనవాహినితో రోడ్లన్నీ కాషాయమయంగా మారాయి. ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని మోడీ ముందుకు కదిలారు. ర్యాలీ ఆధ్యాంతం మోడీ నామజపంతో మల్కాజిగిరి మార్మోగింది.కాగా, రోడ్ షో అనంతరం రాజ్ భవన్‌కు ప్రధాని పయనమయ్యారు.
PM Shri @narendramodi holds a massive road show in Hyderabad, Telangana #ManaModiManaTelangana https://t.co/ziJcgLcRTi
— BJP Telangana (@BJP4Telangana) March 15, 2024
ఇక, శనివారం నాగర్‌కర్నూల్‌లో జరగనున్న బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభ నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నల్గొండ పార్లమెంట్ స్థానాలు లక్ష్యంగా జరగనుంది. అలాగే మార్చి 18న ప్రధాని మోడీ జగిత్యాల బహిరంగ సభలో పాల్గొంటారు. కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి ఎంపీ స్థానాలే లక్ష్యంగా ఈ సభకు రూపకల్పన చేశారు. ఈ రెండు సభలకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తారని బీజేపీ నేతలు వెల్లడించారు.
-
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్!












Click it and Unblock the Notifications