పోచంపల్లి శారీలకు ఫ్లాట్ అయ్యారు: మెట్రో స్టేషన్లకు పోచంపల్లి డిజైన్
హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాదులో నిర్మిస్తున్న మెట్రో రైలు స్టేషన్‌లో పోచంపల్లి చీర డిజైన్ కనిపిస్తోంది. పోచంపల్లి చీరలు ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఈ చీరల డిజైన్ మెట్రో రైలు అధికారులను కూడా ముగ్ధులను చేశాయి.
దీంతో, హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు ఉప్పల్ స్టేషన్‌లో సైడ్ వాక్‌ను పోచంపల్లి శారీ రూపంలో తీర్చిదిద్దారు. నాగోల్ స్టేషన్ వద్ద గ్రే, బ్లాక్ రంగు టైల్స్ ఫైనలైజ్ అయ్యాయి. ఆరు మెట్రో స్టేషన్లను ఆర్కిటెక్చర్లకు అప్పగించారు.

ఉప్పల్ మెట్రో స్టేషన్ సైట్ వాక్‌కు రెడ్, గ్రే, బ్లాక్ పోచంపల్లి శారీ డిజైన్, నాగోల్ స్టేషన్‌కు గ్రే, బ్లాక్ పోచంపల్లి శారీ డిజైన్ ఎంపిక చేశారు. కాగా, మెట్రో రైలు పనులు వేగంగా సాగుతున్నాయి. 2017లోగా తొలిదశ మెట్రో సర్వీసులు ప్రారంభం కానున్నాయి.












Click it and Unblock the Notifications