నేలపై కూర్చొని మంత్రికి కోపం తెప్పించారు! మక్తల్లో 'గ్రామజ్యోతి' షాక్

నిజామాబాద్/మహబూబ్ నగర్: గ్రామజ్యోతి అవగాహన సదస్సులో ఎంపీటీసీ సభ్యులు ఆదివారం నాడు నిరసన వ్యక్తం చేశారు. నిజామాబాదులో నిర్వహించిన సదస్సుకు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఆయన ఎదుటే ఎంపీటీసీలు నిరసన తెలిపారు. దీంతో, పోచారం ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రామజ్యోతి కార్యక్రమంలో ప్రభుత్వం తమకు ప్రాధాన్యం కల్పించలేదని ప్రజా ప్రతినిధులు నేలపై కూర్చొని నిరసన తెలిపారు. మంత్రి ప్రసంగించే సమయంలో బహిష్కరించి సమావేశం మధ్యలో నుంచి వెళ్లిపోయారు.

తమకు ప్రాధఆన్యం కల్పించాలని ఎంపీటీసీ సభ్యులు మంత్రి పోచారంను కోరారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో మాట్లాడుతానని చెప్పినా మీరు ఎందుకు వినడం లేదని వారించారు.

Pocharam unhappy with MPTCs

అధికారులను నిర్బంధం

గ్రామజ్యోతిలో తమను భాగస్వాములు చేయాలని ఎంపీడీవో కార్యాలయంలో అధికారులను నిర్బంధించిన సంఘటన సోమవారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లా మక్తల్‌లో చోటు చేసుకుంది.

గ్రామజ్యోతిలో తమనూ భాగస్వాములను చేయాలని ఎంపిటిసి, జెడ్పీటీసీలు నిరసన చేపట్టారు. అధికారులు తమ గ్రామానికి రాకుండా అడ్డుకున్నారు. తమనూ భాగస్వాములు చేయాల్సిందేనని వారు పట్టుబట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+