బీ అలర్ట్: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు- ఈ మార్గాల్లో వెళ్లొద్దు
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఆదివారం మారథాన్ ఏర్పాటు కానుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. పలు చోట్ల వాహనాలను దారి మళ్లించారు. తెల్లవారు జామున 4:30 నుంచి ఉదయం 10 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి.
నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు ఈ మారథాన్ జరుగనుంది. మారథాన్‌కు ఆటంకాలు కలగకుండా పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. వాహనాల రాకపోకలను మళ్లించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విడుదల చేశారు.

జూబ్లీహిల్స్ నుంచి కావూరి హిల్స్ మీదుగా వచ్చే ట్రాఫిక్.. సీఓడీ జంక్షన్ -దుర్గం చెరువు - టీ హబ్ జంక్షన్ - బయో డైవర్సిటీ జంక్షన్ - గచ్చిబౌలి, ఓఆర్ఆర్ మీదుగా మళ్లించారు. రోడ్ నంబర్ 45 నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా వెళ్లే వాహనాలను కావూరి హిల్స్ - మాదాపూర్ పోలీస్ స్టేషన్- సీఓడీ జంక్షన్ - దుర్గం చెరువు - ఐటీసీ కోహినూర్- టీ హబ్ జంక్షన్ - బయో డైవర్సిటీ జంక్షన్ - గచ్చిబౌలి - ఓఆర్ఆర్ వైపు మళ్లించారు.
సీఓడీ- దుర్గం చెరువు నుంచి వచ్చే వాహనాలను ఐటీసీ కోహినూర్ వెనుక వైపు రోడ్డు- నాలెడ్జ్ సిటీ రోడ్- టీ హబ్ రోడ్ - స్కై వ్యూ లేన్- ఎన్సీబీ జంక్షన్ మీదుగా మళ్లించారు. మెహిదీపట్నం, ఓఆర్ఆర్ నుంచి వచ్చే ట్రాఫిక్ గచ్చిబౌలి జంక్షన్ నుంచి కొండాపూర్-రాడిసన్ జంక్షన్-బొటానికల్ జంక్షన్- హెరిటేజ్ జంక్షన్-మసీద్ బండ విలేజ్ జంక్షన్- హెచ్‌సీయూ డిపో- లింగంపల్లి వైపు మళ్లించారు.
కొండాపూర్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను జీపీఆర్ఏ క్వార్టర్స్ ఇందిరా నగర్- బ్రహ్మ కుమారీస్ - గోపీచంద్ అకాడమీ- విప్రో వైపుగా మళ్లించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. క్యూ-సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను విప్రో జంక్షన్- నానక్‌రామ్‌గూడ - రోటరీ-ఓఆర్‌ఆర్-గచ్చిబౌలి వైపు మళ్లించారు.
లింగంపల్లి/హెచ్‌సీయు వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను డీఎల్ఎఫ్ జంక్షన్-రాడిసన్ జంక్షన్- జెడ్‌పీహెచ్ఎస్ గచ్చిబౌలి- గచ్చిబౌలి జంక్షన్-మెహదీపట్నం వైపు మళ్లించినట్లు వివరించారు. కూకట్‌పల్లి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లాలనుకునే ప్రయాణికులు సైబర్ టవర్స్ జంక్షన్ - కొత్తగూడ జంక్షన్ - గచ్చిబౌలి జంక్షన్ - ఓఆర్ఆర్ మీదుగా విమానాశ్రయానికి వెళ్లాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications