ఇంటికి తాళం ఉంటే అంతే: గజదొంగ అరెస్ట్, 20లక్షలు సొత్తు సీజ్(పిక్చర్స్)

హైదరాబాద్: తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న పేరుమోసిన దొంగను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ క్రైం డీసీపీ నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పుగూడ నివాసి కట్టెల అనూప్ కుమార్ అలియాస్ నితీష్ అలియాస్ రాజు అలియాస్ టింకు(24) ఎనిమిదేళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్నాడు.

తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఇతడు దొంగతనాలకు పాల్పడుతున్నాడు. గత ఏడాది జూలైలో చర్లపల్లి జైలు నుంచి విడుదలై ఉప్పుగూడా రైల్వే స్టేషన్ సమీపంలో ఉండే నల్ల రంజిత్ కుమార్ (24)తో కలిసి మళ్లీ చోరీలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో సరూర్‌నగర్ సిసిఎస్ పోలీసులకు బుధవారం పట్టుబడ్డారు.

గజదొంగ అరెస్ట్

గజదొంగ అరెస్ట్

తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న పేరుమోసిన దొంగను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.

గజదొంగ అరెస్ట్

గజదొంగ అరెస్ట్

పట్టుబడిన ఇద్దరు నిందితుల నుంచి రూ.20 లక్షల విలువ చేసే 26 తులాల బంగారు ఆభరణాలు, కారు, రెండు బైక్‌లు, రెండు ల్యాప్‌టాప్‌లు, రెండు డీవీడీ ప్లేయర్లు, ఎల్‌సీడీ టీవీ, డిజిటల్ కెమెరా, హోం థియేటర్, మోటోజీ సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

గజదొంగ అరెస్ట్

గజదొంగ అరెస్ట్

సైబరాబాద్ క్రైం డీసీపీ నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పుగూడ నివాసి కట్టెల అనూప్ కుమార్ అలియాస్ నితీష్ అలియాస్ రాజు అలియాస్ టింకు(24) ఎనిమిదేళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్నాడు.

గజదొంగ అరెస్ట్

గజదొంగ అరెస్ట్

గత ఏడాది జూలైలో చర్లపల్లి జైలు నుంచి విడుదలై ఉప్పుగూడా రైల్వే స్టేషన్ సమీపంలో ఉండే నల్ల రంజిత్ కుమార్ (24)తో కలిసి మళ్లీ చోరీలకు పాల్పడుతున్నాడు.

ఇద్దరూ కలిసి అమీర్‌పేట, సరూర్‌నగర్, ఎల్‌బీనగర్, సైదాబాద్, మలక్‌పేట పోలీస్‌స్టేషన్ల పరిధిలో పగటి పూట రెక్కీ వేసి, రాత్రి వేళల్లో ఐదు చోట్ల దొంగతనాలు చేశారు. ఎల్‌బీనగర్ పీఎస్ పరిధిలో ఐ20 కారు, సరూర్‌నగర్, బేగంపేట పీఎస్ పరిధిలో బైక్‌లను కూడా ఎత్తుకెళ్లారు.

పట్టుబడిన ఇద్దరు నిందితుల నుంచి రూ.20 లక్షల విలువ చేసే 26 తులాల బంగారు ఆభరణాలు, కారు, రెండు బైక్‌లు, రెండు ల్యాప్‌టాప్‌లు, రెండు డీవీడీ ప్లేయర్లు, ఎల్‌సీడీ టీవీ, డిజిటల్ కెమెరా, హోం థియేటర్, మోటోజీ సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

కాగా, అనూప్ కుమార్ ఎనిమిదేళ్ల కాలంలో 34 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని డీసీపీ తెలిపారు. నాన్‌బెయిలబుల్ వారెంట్లున్నా తప్పించుకు తిరుగుతూ మకాంను ఉప్పుగూడలోని శివాజీనగర్‌కు మార్చాడని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+