నగదు జమ చేసేందుకు వచ్చి మేనేజర్ ను లవ్ చేశాడు, ఆమె ఏం చేసిందంటే

నగదు జమ చేసేందుకు వచ్చి మేనేజర్ ను లవ్ చేశాడు, ఆమె ఏం చేసిందంటే

హైదరాబాద్ :ప్రేమ పేరుతో బ్యాంకు మేనేజర్ కు అసభ్యకర సందేశాలను పంపుతూ వేధిస్తోన్న ఓ ఆర్ ఎం పి డాక్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. రద్దు చేసిన పెద్ద నగదు నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడంతో ఏర్పడిన పరిచయాన్ని ఆసరాగా చేసుకొని బ్యాంకు మేనేజర్ కు ప్రేమ సందేశాలు పంపాడు,.ఆమె నుండి స్పందన రాకపోవడంతో అసభ్య కర సందేశాలను పంపుతూ వేధించాడు. ఆ ప్రబుద్దుడిని పోలీసులు శనివారం నాడు అరెస్టు చేశారు.

పెద్ద నగదు నోట్ల రద్దుతో ఓ ఆర్ ఎం పి డాక్టర్ హైద్రాబాద్ లోని సైదాబాద్ పరిధిలోని ఓ బ్యాంకుకు వారానికి మూడు రోజుల పాటు వెళ్ళేవాడు. తనతో పాటు తన వెంటే ఉన్న ఖతాదారులకు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని అడిగేవాడు. ఆతని చొరవతో కొన్నిసార్లు ఆతని వినతిని బ్యాంకు మేనేజర్ మన్నించింది.అయితే దీన్ని అలుసుగా తీసుకొన్న ఆ ఆర్ ఎంపి డాక్టర్ ఆమెకు ప్రేమ పేరుతో అసభ్యకర సందేశాలు పంపేవాడు.

police arrest rmp doctor in hyderabad

అటెండర్ వద్ద నుండి పోన్ నెంబర్ తీసుకొన్నాడు
వారానికి మూడు రోజుల పాటు బ్యాంకుకు వెళ్ళే ఆర్ ఎం పి డాక్టర్ అటెండర్ వద్ద నుండి బ్యాంకు మేనేజర్ నెంబర్ ను సంపాదించాడు. ఆ నెంబర్ కు అసభ్యకర సందేశాలను పంపేవాడు. ప్రేమిస్తున్నానని ఆమెకు ఎస్ ఎం ఎస్ లు చేసేవాడు. ఫోన్లు చేసి వేధించేవాడు. దీంతో ఆమె షీ టీమ్స్ ను ఆశ్రయించింది. షీ టీమ్స్ సిబ్బంది ఆర్ ఎం పి డాక్టర్ ను పట్టుకొన్నారు.

వివాహమై ఇద్దరు పిల్లలున్నారు

ఆర్ ఎం పి డాక్టర్ కు వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడ ఉన్నారు. అయితే బ్యాంకుకు వెళ్ళే సమయంలో ఆమెతో ఏర్పడిన పరిచయం కారణంగా ఆమెను ఇబ్బంది పెట్టాడు. షీ టీమ్స్ రంగంలోకి దిగి అతణ్ణి అరెస్టు చేయడంతో ఆయనకు వివాహమైన విషయం వెలుగుచూసింది. వివాహమై ఇద్దరు పిల్లలున్న అతడు తన వక్రబుద్దితో పోలీసులకు చిక్కాడు.

డాక్టర్ ను వేధించాడు

ఇంజనీరింగ్ చదివే యువకుడు ఓ మహిళా డాక్టర్ ను వేధించాడు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే రఘు అనే యువకుడు పేస్ బుక్ లో అందమైన డాక్టర్ ప్రోఫైల్ చూసి ఆమెతో ప్రేమలో పడ్డారు. ఆమె పనిచేసే ఆసుపత్రికి వెళ్ళి, ఆమె ఫోన్ నెంబర్ సంపాదించాడు. ఆ ఫోన్ కు ప్రేమిస్తున్నానని సందేశాలు పంపాడు, ఆమె నుండి రెన్సాన్స్ రాకపోవడంతో ఆమెకు అసభ్యకర సందేశాలు పంపేవాడు. అంతేకాదు ఆమె తనకు వివాహమైన వినలేదు. చివరికి ఆమె షీ టీమ్స్ ను ఆశ్రయించింది. దీంతో అతడు పోలీసులకు చిక్కాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+