16 ఏళ్ల కిందట లవ్ ఫెయిల్, ఇప్పుడూ..: వీడిన టెక్కీ కేసు, సునీతది ఆత్మహత్యే!

సాఫ్టువేర్ ఉద్యోగిని సునీత హత్య కేసును మాదాపూర్ పోలీసులు చేధించినట్లుగా కనిపిస్తోంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

హైదరాబాద్: సాఫ్టువేర్ ఉద్యోగిని సునీత హత్య కేసును మాదాపూర్ పోలీసులు చేధించినట్లుగా కనిపిస్తోంది. ఆమెది ఆత్మహత్యగా గుర్తించారు. ప్రేమను అంగీకరించకపోవడంతో చనిపోయినట్లుగా తెలుస్తోంది.

ప్రేమను అంగీకరించకుంటే చనిపోతానని తన స్నేహితుడికి వాట్సాప్‌లోను సందేశం పంపించింది. పోలీసులు ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి పలు వివరాలు రాబట్టారు. మరిన్ని వివరాలు రాబడుతున్నారు.

తద్వారా, సునీత మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే, ఆత్మహత్యనే అని పూర్తిగా నిర్ధారణకు ఇంకా రాలేదని, మరింత దర్యాఫ్తు, అలాగే పోస్టుమార్టం నివేదిక అనంతరం నిర్ధారణకు రానున్నారు.

సునీత మృతి కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఆమె ఆత్మహత్య చేసుకుందని..., ఎవరైనా చంపి ఉంటారని.., పాత ప్రేమ హత్యకు దారి తీసి ఉండవచ్చునని.. ఇలా ఎన్నో కోణాల్లో పోలీసులు దర్యాఫ్తు చేశారు. చివరకు ఆత్మహత్యగా గుర్తించారు.

పెట్రోల్ కొంటూ..

పెట్రోల్ కొంటూ..

పెట్రోల్ కొంటూ..

అంతకుముందు, సునీతది ఆత్మహత్యగా కూడా వార్తలు వచ్చాయి. ప్రేమ విఫలం కావడంతో ఆమె దారుణానికి పాల్పడిందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు వార్తలు వచ్చాయి.

ఓ పెట్రోలు బంకు నుంచి పెట్రోలు కొంటున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయినట్లుగా కూడా ఉందని, దీంతో ఆమెనే స్వయంగా నిప్పు అంటించుకొని ఉండవచ్చునని అంచనాకు వచ్చారు. వన్ సైడ్ లవ్.. ప్రేమకు నిరాకరించడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి.

ఆఫీస్‌కు వెళ్లలేదు

ఆఫీస్‌కు వెళ్లలేదు

సునీత సోమవారం, మంగళవారం (ప్రేమికుల దినోత్సవం) ఆఫీస్‌కు వెళ్లలేదు. మంగళవారం ఆఫీస్‌కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పారు. కానీ వెళ్లలేదు. అంతకుముందు రెండు రోజుల క్రితమే.. ఏదో కారణం చెప్పి ఆమె ఆఫీస్ మానేశారు.

మంగళవారం ఇంట్లో ఆఫీస్‌కు అని చెప్పి ఎవరినో కలిసేందుకు వెళ్లారు. ఆ తర్వాత రాత్రి ఇంటికి వచ్చారు. రాత్రి ఆమె మూడీగా ఉన్నారు.

బస్టాప్ వద్ద దించిన సోదరుడు

బస్టాప్ వద్ద దించిన సోదరుడు

ఆ మరుసటి రోజు.. అంటే బుధవారం (వాలెంటెన్స్ డే తర్వాతి రోజు) సునీత ఆఫీస్‌కు వెళ్తానంటే ఆమె అన్నయ్య ఆమెను బస్టాప్ వద్ద దించి వచ్చారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆమె మృతి చెందినట్లు పోలీసుల ద్వారా సమాచారం అందింది.

16 ఏళ్ల నాటి లవ్ అఫైర్..

16 ఏళ్ల నాటి లవ్ అఫైర్..

సునీత మృతిలో పోలీసులు పలు కోణాల్లో దర్యాఫ్తు చేశారు. ప్రధానంగా మూడు కోణాలపై దృష్టి సారించారు. 16 ఏల్ల క్రితమే సునీతకు లవ్ అపైర్ ఉంది. నాడు అతని చేతిలో ఆమె మోసపోయింది. అప్పటి నుంచి ప్రేమ - పెళ్లిని పక్కన పెట్టి కుటుంబం కోసం ఉద్యోగం చేస్తున్నారు.

సునీత వద్ద టాటా, జియో, ఎయిర్ టెల్.. మూడు సిమ్‌లు ఉన్నాయి. మూడు సిమ్ కార్డులతో ముగ్గురు యువకులతో మాట్లాడేదని పోలీసుల విచారణలో తేలిందని సమాచారం.

ఫోన్లో ఆమె ఎవరెవరితో మాట్లాడింది, ఎక్కువ సేపు ఎంత మాట్లాడింది.. అనే విషయాలపై పోలీసులు ఆ ముగ్గురు యువకులను విచారించారని తెలుస్తోంది. మరో విషయం ఏమంటే సునీత మృతిలో లవ్ జిహాద్ కోణం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఎందుకంటే ఆమె మరో మతానికి చెందిన వ్యక్తిని ప్రేమించారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+