హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైటెక్ కాపీ: బనియన్‌లో బ్లూటూత్, అండర్ వేర్‌లో ఫోన్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇంటర్‌ పరీక్షల్లో బనియన్‌లో బ్లూటూత్, అండర్ వేర్‌లో ఫోన్ పెట్టుకుని ఓ విద్యార్థి హైటెక్‌ కాపీయింగ్‌కు పాల్పడి చివరకు పోలీసులకు చిక్కాడు. దీనికి సంబంధించిన వివరాలను వెస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటేశ్వరరావు పంజాగుట్ట పోలీ‌స్ స్టేషన్లో వెల్లడించారు.

బల్కంపేటలోని శ్రీరామ్‌నగర్‌కు చెందిన షేక్‌ ఇజాజ్‌ ఎస్‌ఆర్‌నగర్‌ న్యూ విజన్‌ జూనియర్‌ కళాశాలలో 2014లో ఇంటర్మీడియట్‌ ఆరు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. రెండు సంవత్సరాలుగా సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నా సబ్జెక్టులు క్లియర్‌ కాలేదు.

దీంతో ఈసారి ఎలాగైనా సరే ఆ సబ్జెక్టుల్లో పాస్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇంజనీరింగ్‌ చదువుతున్న బోరబండ డివిజన్‌ నవభారతనగర్‌కు చెందిన సమీయుల్లా అనే తన స్నేహితుడిని కలిసి సాయం కోరాడు. మాస్ కాపీయింగ్ కోసం 13,299 రూపాయల విలువైన ఒక ఎలక్ట్రానిక్ మినీ వైర్‌లెస్‌ కిట్‌ను కొనుగోలు చేశాడు.

అందులోని బ్లూటూతను బనియన్‌లో పెట్టుకున్న అతడు.. ఓ మినీ ఇయర్‌సెట్‌ను చెవిలో పెట్టుకున్నాడు. ఇక, తన స్నేహితుడితో మాట్లాడేందుకు అండర్‌వేర్లో ఫోన్‌ పెట్టుకుని కాపీయింగ్‌కు పాల్పడ్డాడు. ఈ వైర్‌లెస్ కిట్ పనిచేస్తుందా లేదా అన్నది తెలుసుకోవడానికే మూడు రోజుల పాటు అతడు తన స్నేహితుడితో కలిసి రిహార్సల్‌ కూడా చేశాడు.

ఇక, పరీక్ష హాల్లో ఉన్న ఇజాజ్‌, బయట ఉన్న సమీయుల్లాల మధ్య సమాచారం చేరవేసేందుకు గాను దగ్గును కోడ్‌భాషగా పెట్టుకున్నారు. ఆ దగ్గుతోనే అతడు దొరికిపోయాడు. పరీక్ష హాలులో పదే పదే దగ్గుతుండటంతో అనుమానం వచ్చిన సూపరింటెండెంట్‌ అతడిని తనిఖీ చేశారు.

అతడి వద్ద ఉన్న ఆధునిక ఎలక్ట్రానిక్ మాస్ కాపీయింగ్ పరికరాలను చూసి ఆయన అవాక్కయ్యారు. వెంటనే ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. వెంటనే పరీక్ష హాలుకు చేరుకున్న పోలీసులు ఆ ఇద్దరిని బుధవారం అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వీరిపై ఏపీ పబ్లిక్‌ ఎగ్జామినేషన్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ మాల్‌ ప్రాక్టీస్‌ అండ్‌ అన్‌ఫేర్‌ అఫెన్స్‌, ఐపీసీ 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

హైటెక్ కాపీ: బనియన్‌లో బ్లూటూత్, అండర్ వేర్‌లో ఫోన్

హైటెక్ కాపీ: బనియన్‌లో బ్లూటూత్, అండర్ వేర్‌లో ఫోన్

ఇంటర్‌ పరీక్షల్లో బనియన్‌లో బ్లూటూత్, అండర్ వేర్‌లో ఫోన్ పెట్టుకుని ఓ విద్యార్థి హైటెక్‌ కాపీయింగ్‌కు పాల్పడి చివరకు పోలీసులకు చిక్కాడు. దీనికి సంబంధించిన వివరాలను వెస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటేశ్వరరావు పంజాగుట్ట పోలీ‌స్ స్టేషన్లో వెల్లడించారు.

హైటెక్ కాపీ: బనియన్‌లో బ్లూటూత్, అండర్ వేర్‌లో ఫోన్

హైటెక్ కాపీ: బనియన్‌లో బ్లూటూత్, అండర్ వేర్‌లో ఫోన్

బల్కంపేటలోని శ్రీరామ్‌నగర్‌కు చెందిన షేక్‌ ఇజాజ్‌ ఎస్‌ఆర్‌నగర్‌ న్యూ విజన్‌ జూనియర్‌ కళాశాలలో 2014లో ఇంటర్మీడియట్‌ ఆరు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. రెండు సంవత్సరాలుగా సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నా సబ్జెక్టులు క్లియర్‌ కాలేదు.

 హైటెక్ కాపీ: బనియన్‌లో బ్లూటూత్, అండర్ వేర్‌లో ఫోన్

హైటెక్ కాపీ: బనియన్‌లో బ్లూటూత్, అండర్ వేర్‌లో ఫోన్

దీంతో ఈసారి ఎలాగైనా సరే ఆ సబ్జెక్టుల్లో పాస్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇంజనీరింగ్‌ చదువుతున్న బోరబండ డివిజన్‌ నవభారతనగర్‌కు చెందిన సమీయుల్లా అనే తన స్నేహితుడిని కలిసి సాయం కోరాడు. మాస్ కాపీయింగ్ కోసం 13,299 రూపాయల విలువైన ఒక ఎలక్ట్రానిక్ మినీ వైర్‌లెస్‌ కిట్‌ను కొనుగోలు చేశాడు.

 హైటెక్ కాపీ: బనియన్‌లో బ్లూటూత్, అండర్ వేర్‌లో ఫోన్

హైటెక్ కాపీ: బనియన్‌లో బ్లూటూత్, అండర్ వేర్‌లో ఫోన్

అందులోని బ్లూటూతను బనియన్‌లో పెట్టుకున్న అతడు.. ఓ మినీ ఇయర్‌సెట్‌ను చెవిలో పెట్టుకున్నాడు. ఇక, తన స్నేహితుడితో మాట్లాడేందుకు అండర్‌వేర్లో ఫోన్‌ పెట్టుకుని కాపీయింగ్‌కు పాల్పడ్డాడు. ఈ వైర్‌లెస్ కిట్ పనిచేస్తుందా లేదా అన్నది తెలుసుకోవడానికే మూడు రోజుల పాటు అతడు తన స్నేహితుడితో కలిసి రిహార్సల్‌ కూడా చేశాడు.

English summary
Police arrested intermediate student for malparacticing with high technology.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X