మోస్ట్ వాంటెడ్ చైన్‌స్నాచర్ ఖలీఫా అరెస్ట్(పిక్చర్స్)
హైదరాబాద్: పోలీసుల కళ్లల్లో పెప్పర్ స్పే చల్లి పారిపోయిన కరుడు గట్టిన చైన్ స్నాచర్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం సికింద్రాబాద్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదనపు డిసిపి లింబారెడ్డి, ఉత్తర మండలం ఇన్‌స్పెక్టర్ ఎపి ఆనంద్‌కుమార్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ షామా టాకీస్ మోడల్ టౌన్ కాలనీకి చెందిన మహమ్మద్ అఖీలుద్దీన్ అలియాస్ ఖలీఫా(24) కరుడుగట్టిన చైన్ స్నాచర్.
ఖలీఫా ఇతర పేరుమోసిన నేరస్థులైన లంబా, సలీమ్ తదితర గ్యాంగ్‌లతో కలసి పలు చైన్‌స్నాచింగ్‌లు చేశాడు. ఒంటరిగా కూడా పలు కేసుల్లో నిందితుడు. ఇతనిపై 100 కేసులు దాకా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఎస్‌ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో అరెస్టై రిమాండ్‌కు వెళ్లాడు. జ్యుడీషియల్ కస్టడిలో ఉన్న నిందితుడ్ని ఎల్‌బినగర్ పోలీసులు 2015, ఫిబ్రవరి 2న పిటి వారెంట్ కింద ఖలీఫాను అదుపులోకి తీసుకున్నారు. ఎల్‌బినగర్ కోర్టులో ప్రవేశపెట్టి తిరిగి చర్లపల్లి జైలుకు తరలిస్తున్నారు. మధ్యాహ్నం ఖలీఫా భోజనం కోసం అని చెప్పి చైతన్యపురి ప్రాంతంలో వాహనం అపాడు.

ఖలీఫా అరెస్ట్
పోలీసుల కళ్లల్లో పెప్పర్ స్పే చల్లి పారిపోయిన కరుడు గట్టిన చైన్ స్నాచర్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఖలీఫా అరెస్ట్
గురువారం సికింద్రాబాద్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదనపు డిసిపి లింబారెడ్డి, ఉత్తర మండలం ఇన్‌స్పెక్టర్ ఎపి ఆనంద్‌కుమార్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు.

ఖలీఫా అరెస్ట్
హైదరాబాద్ షామా టాకీస్ మోడల్ టౌన్ కాలనీకి చెందిన మహమ్మద్ అఖీలుద్దీన్ అలియాస్ ఖలీఫా(24) కరుడుగట్టిన చైన్ స్నాచర్.

ఖలీఫా అరెస్ట్
ఖలీఫా ఇతర పేరుమోసిన నేరస్థులైన లంబా, సలీమ్ తదితర గ్యాంగ్‌లతో కలసి పలు చైన్‌స్నాచింగ్‌లు చేశాడు. ఒంటరిగా కూడా పలు కేసుల్లో నిందితుడు. ఇతనిపై 100 కేసులు దాకా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఎస్‌ఆర్
తన సోదరుడి సహాయంతో ఎస్కార్ట్ పోలీసుల కళ్లల్లో పెప్పర్ స్పే చల్లి తప్పించుకుని పారిపోయాడు. అప్పట్లో ఈ కేసు సంచలనం సృష్టించింది. ఖలీఫా పోలీసుల కళ్లుకప్పి వివిధ ప్రాంతాలలో మకాం మారుస్తూ తప్పించుకుని తిరుగుతున్నాడు. గురువారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఖలీఫాను నార్త్‌జోన్ ఇన్‌స్పెక్టర్ ఆనంద్‌కుమార్, వెస్ట్ జోన్ ఎస్సైలు వెంకటేశ్వరగౌడ్, మల్లికార్జున్, ప్రభాకర్‌రెడ్డి అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడిపై లంగర్‌హౌజ్ పోలీసు స్టేషన్ పరిధిలో రెండు ఎన్‌బిడబ్య్లూ వారెంట్లు ఉన్నాయి. నిందితున్ని తదుపరి విచారణ నిమిత్తం లంగర్‌హౌజ్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పిడి యాక్ట్ ప్రయోగించే అవకాశం ఉందని తెలిపారు. వరుసగా స్నాచింగ్‌లు చేసి పోలీసుల దృష్టి మరల్చేందుకు ముంబయి, అజ్మీర్ తదితర ప్రాంతాలకు వెళ్లి తలదాచుంటున్నాడని తెలిపారు. స్నాచింగ్‌లతో వచ్చిన డబ్బులతో జల్సాలకు పాల్పడేవాడు. అవసరమైతే విమానాల్లో ప్రయాణాలు చెయ్యడం, స్టార్ హోటల్స్‌లో మకాం వేసేవాడని తెలిపారు.












Click it and Unblock the Notifications