Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రిలేషన్‌షిప్ వదిలేస్తా, 20ఏళ్ళ యువతివల్లే చిచ్చు: భార్యని కొట్టిన టీఆర్ఎస్ నేత కేసులో ట్విస్ట్‌లు

టీఆర్ఎస్ యవ నాయకుడు శ్రీనివాస రెడ్డి అరాచకంలో ఎన్నో కోణాలు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఇంటికి తాళం ఉంది. పరారీలో ఉన్న శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

Recommended Video

    TRS Leader Srinivas Reddy Arrest : టీఆర్ఎస్ నేత రాస లీలలు | Oneindia Telugu

    హైదరాబాద్: టీఆర్ఎస్ యవ నాయకుడు శ్రీనివాస రెడ్డి అరాచకంలో ఎన్నో కోణాలు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఇంటికి తాళం ఉంది. పరారీలో ఉన్న శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆయన చేతిలో దెబ్బలు తిన్న భార్య సంగీత.. భర్త ఇంటి వద్ద రెండో రోజైన సోమవారం ఆందోళన కొనసాగించింది.

    చదవండి: టీఆర్ఎస్ నేత లీలలు: నందినికి మూడో యువతి పేరెంట్స్ అండ, 'కూతురిని లోబర్చుకున్నాడు'

    సంగీతకు మూడో భార్య తల్లి మద్దతు

    సంగీతకు మూడో భార్య తల్లి మద్దతు

    సంగీతకు మహిళా సంఘాలు మద్దతు పలికారు. మరో ఆసక్తికర విషయం ఏమంటే శ్రీనివాస్ రెడ్డి తన భార్య సంగీతను కొట్టడానికి ఎవరైతే కారణమో.. ఆ యువతి తల్లి శిరీష వచ్చి ఆమెకు మద్దతు పలికారు. మరో షాకింగ్ విషయం ఏమంటే శ్రీనివాస రెడ్డికి సంగీత రెండో భార్య. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి చట్టబద్దంగా సంగీతను పెళ్లి చేసుకున్నాడు.

    దేవీని మూడో పెళ్లి చేసుకున్నాడు

    దేవీని మూడో పెళ్లి చేసుకున్నాడు

    ఇప్పుడు సంగీతకు ఆడపిల్ల పుట్టిందని చెబుతూ మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆ యువతి పేరు దేవీ జగదీశ్వరి. ఈమెను పెళ్లి చేసుకొని వచ్చిన శ్రీనివాస్ రెడ్డిని సంగీత నిలదీయడంతో బాగా కొట్టాడు. సంగీతకు దేవీ జగదీశ్వరి తల్లి కూడా మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు.

    ఎవరీ శ్రీనివాస్ రెడ్డి

    ఎవరీ శ్రీనివాస్ రెడ్డి

    మేడ్చల్ జిల్లా బోడుప్పల్ శ్రీనగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్ రెడ్డి తెరాస యువజన విభాగంలో పని చేస్తున్నాడని తెలుస్తోంది. అతను నాలుగేళ్ల క్రితం సంగీతను పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్ల పాప ఉంది. ఆడపిల్ల పుట్టడంతో వేధింపులు ప్రారంభమయ్యాయి. శ్రీనివాస్ రెడ్డి విషయం తెలుసుకున్న స్థానిక తెరాస మహిళా నేతలు కొందరు అక్కడకు వచ్చారు. ఆయన యువజన విభాగంలో నాయకుడు కాదని, కేవలం మెంబర్ మాత్రమేనని, ఇలాంటి వారిని పార్టీలోకి రాకుండా చూస్తామని చెబుతున్నారు.

    సంగీతను దూరం పెట్టడానికి 20 ఏళ్ల యువతి కారణం

    సంగీతను దూరం పెట్టడానికి 20 ఏళ్ల యువతి కారణం

    ప్రస్తుతం సంగీతను శ్రీనివాస రెడ్డి దూరం పెట్టడానికి దేవీ జగదీశ్వరి కారణం. ఆమె కూడా మీడియా ముందుకు వచ్చారు. ఆమె వయస్సు ఇప్పుడు ఇరవై ఏళ్లు. తనకు తన తల్లి ద్వారానే శ్రీనివాస రెడ్డి పరిచయం అని, తామిద్దరం పెళ్లి చేసుకున్నామని తెలిపారు.

    శ్రీశైలంలో పెళ్లి చేసుకున్నాం

    శ్రీశైలంలో పెళ్లి చేసుకున్నాం

    తనకు పందొమ్మదిళ్ళ వయస్సు ఉన్నప్పటి నుంచి శ్రీనివాస్ రెడ్డి తెలుసునని, తన ఇంటికి వచ్చేవాడని అతనిని మూడో పెళ్లి చేసుకున్న దేవీ జగదీశ్వరి అన్నారు. తామిద్దరం శ్రీశైలంలో ఇటీవలే పెళ్లి చేసుకున్నామని చెప్పారు.

    నా పెళ్లి చట్టవిరుద్ధమని తెలుసు

    నా పెళ్లి చట్టవిరుద్ధమని తెలుసు

    తన పెళ్లి చట్ట విరుద్ధమని తనకు తెలుసునని దేవీ జగదీశ్వరి చెప్పారు. సంగీతతో విడాకులు అనంతరం తనకు శ్రీనివాస్ రెడ్డితో పెళ్లి చేస్తానని తన తల్లి చెప్పిందని ఆమె వెల్లడించారు. సంగీతతో విడాకుల కోసం ఆరు నెలలుగా వేచి చూస్తున్నామని చెప్పింది.

    మా పెళ్లికి పెద్దలు రాలేదు

    మా పెళ్లికి పెద్దలు రాలేదు

    శ్రీనివాస్ రెడ్డి, తాను ఇద్దరమే పెళ్లి చేసుకున్నామని, పెళ్లి సమయంలో శ్రీశైలానికి పెద్దలు ఎవరూ రాలేదని దేవీ జగదీశ్వరి చెప్పారు. తమ పెళ్లిని రిజిస్టర్ చేయించుకోలేదని వెల్లడించింది. తమ పెళ్లికి సాక్షులు కూడా ఎవరూ లేరని చెప్పింది.

    శ్రీనివాస్ రెడ్డితో నా పెళ్లి మూడోది అని తెలుసు

    శ్రీనివాస్ రెడ్డితో నా పెళ్లి మూడోది అని తెలుసు

    శ్రీనివాస్ రెడ్డికి గతంలో గతంలో ఓ భార్యతో విడాకులు అయ్యాయని, సంగీత రెండో భార్య అని, తాను మూడో దానిని అవుతానని తెలుసునని దేవీ జగదీశ్వరి చెప్పారు.

    శ్రీనివాస్ రెడ్డిని వదిలేస్తా

    శ్రీనివాస్ రెడ్డిని వదిలేస్తా

    శ్రీనివాస్ రెడ్డిని ఇప్పుడు వదిలేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని దేవీ చెప్పారు. సంగీత తన భర్త కోసం పోరాడుతోందని, తాను ఆయనను వదిలి తల్లిదండ్రులతో వెళ్లిపోతానని, సంగీతను ఉండమనండని చెప్పింది. శ్రీనివాస్ రెడ్డితో రిలేషన్ షిప్‌ను వదిలేసుకుంటానని చెప్పింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+