వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆమెను పోలిన అశ్లీల చిత్రం పేస్ బుక్ లో పోస్టుచేసి పోలీసులకు చిక్కాడు

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :తనతో స్నేహంగా ఉండడం లేదనే కారణంగా వివాహితకు అశ్లీల వీడియోను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశాడు. ఆమెను పోలిన మహిళ ఉన్న అశ్లీల వీడియోను ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. . స్నేహితుడే ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు నిర్థారించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

తన ఫేస్ బుక్ ఖాతాకు అసభ్య సందేశాలు వస్తున్నాయని ఓ వివాహిత గత నెల 28వ, తేదిన పోలీసులకు పిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో వెలుగుచూసిన వాస్తవాలతో పోలీసులతో పాటు బాధితురాలు కూడ షాక్ గురైంది.

police arrested two persons for post a porn video in facebook

కొత్తపేటకు చెందిన వ్యాపారి కె .శైలేష్ రెడ్డి ,బోడుప్పల్ కు చెందిన కె. రిసిక్ రెడ్డిలు ఈ దురాగతానికి పాల్పడ్డారు.బాదితురాలి కుటుంబానికి స్నేహితుడుగా ఉన్న శైలేష్ రెడ్డి తన స్నేహితుడు రిసిక్ రెడ్డితో కలిసి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు.

శైలేష్ రెడ్డి ప్రవర్తన సక్రమంగా లేకపోవడంతో అతడిని ఆ వివాహిత దూరం పెట్టింది. అయితే ఆమెపై ఆయన కక్షపెంచుకొన్నాడు. బాధితురాలిని పోలిప మహిళ అశ్లీల వీడియోను డౌన్ లోడ్ చేసి తన స్నేహితుడు రిషిక్ రెడ్డికి పంపాడు. రిసిక్ రెడ్డి ఫేస్ బుక్ ఖాతాను ప్రారంభించి అదే ఖాతా నుండి అశ్లీల వీడియోలను పలువురికి పంపాడు. విచారణలో వాస్తవాలను గుర్తించిన పోలీసులు నిందితులను అరెస్టుచేశారు.

English summary
shailesh reddy and rishik reddy sexual harassment on a married woman. police arrested both of them.shailesh reddy family friend of married woman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X