ఫేక్ బాంబు కాల్: పరుగు, పోలీసుల టెన్షన్(పిక్చర్స్)
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ఆదివారం ఉదయం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు తనిఖీలు చేశారు. రైల్వే స్టేషన్‌లో ఉన్న 10 ప్లాట్ ఫాంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
స్టేషన్‌లోని కార్యాలయాలు, ప్లాట్ ఫాంలతోపాటు పరిసర ప్రాంతాలను కూడా పోలీసులు జల్లెడ పట్టారు. చివరకు బాంబు లేదని నిర్దారణ అవడంతో భద్రతా దళాలు ఊపిరి పీల్చుకున్నాయి.
ఎవరో ఆకతాయి ఆదివారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 2, 3 ప్లాట్ ఫాంలలో బాంబు పెట్టామని పోలీసు కంట్రోల్ రూంకు సమాచారం ఇచ్చాడు.

బాంబు బెదిరింపు
వేసవి సెలవులకు వివిధ ప్రాంతాలకు తరలి వెళ్లే ప్రయాణికులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిక్కిరిసి ఉన్న సమయంలో బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు.

బాంబు బెదిరింపు
బాంబ్ స్క్వాడ్‌ను, డాగ్ స్క్వాడ్‌లను రప్పించి రైల్వే భద్రతా సిబ్బంది మూకుమ్మడిగా తనిఖీలు నిర్వహించడంతో ఏమి జరిగిందోననే భయాందోళన ప్రయాణికులలో నెలకొంది.

బాంబు బెదిరింపు
స్టేషన్‌లో బాంబు ఉందన్న విషయం తెలుసుకున్న కొందరు ప్రయాణికులు భయంతో స్టేషన్ నుంచి పరుగులు తీశారు. ప్రయాణికులకు సంబంధించిన బ్యాగ్‌లు, లగేజీ, ఇతర వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

బాంబు బెదిరింపు
రెండు గంటల పాటు ఈ హడావుడి కొనసాగింది. బాంబు లేకపోవడంతో ఎవరో ఆకతాయి చేసినపనిగా పోలీసులు గుర్తించారు.

బాంబు బెదిరింపు
ఫోన్ నెంబరు ఆధారంగా ఆకతాయిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. రైల్వే ప్రయాణికుల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటున్నామని భద్రతా సిబ్బంది తెలిపారు.

బాంబు బెదిరింపు
ఇలాంటి అకతాయిల వల్ల తమ సమయం వృథా కావడంతో పాటు ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొంటున్నాయని అధికారులు పేర్కొన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications