వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దారుణం: తప్పతాగి పోలీసులు తన్నుకున్నారు

By Pratap
|
Google Oneindia TeluguNews

వరంగల్: మద్యం మత్తులో పోలీసులు తన్నుకున్న సంఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. డబ్బులు ఇచ్చి పుచ్చుకునే విషయంలో గొడవపడిన ఇద్దరు మంచి చెడులు మరిచి స్ట్రీట్ ఫైట్‌కు దిగారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హన్మకొండ లోని పోలీస్ హెడ్‌క్వార్టర్ ప్రధాన గేట్ వద్ద ఇద్దరు పోలీసులు ముష్టిఘాతుకాలకు పాల్పడడం కలకలం రేపింది.

వారు గొడవపడుతున్న విషయాన్ని గేట్ వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది గుర్తించి, వారించడంతో గొడవ సద్దుమణిగింది. ఈ విషయం ఉన్నతాధికారుల వద్దకు చేరింది. దీన్ని సీరియస్‌గా పరిగణించిన అధికారులు వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

Police clashed each other following the consumption of liquor

హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్‌ఎస్సై, ఓ కానిస్టేబుల్ ఓ బార్‌లో మద్యం సేవించారు. తిరిగి హెడ్‌క్వార్టర్స్‌లోకి వెళ్తున్న క్రమంలో గేట్ వద్దకు చేరుకోగానే డబ్బుల విషయమై ఇద్దరు గొడవ పడ్డారు. అది చిలికి చిలికి గాలివానాలా మారి ఘర్షణకు దారి తీసింది. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుని ముష్టి ఘాతాలకు దిగారు.

క్షణాల్లో జరిగిన ఘటనకు కంగుతిన్న అక్కడి సిబ్బంది ఇద్దరిని వారించి అక్కడి నుంచి పంపించినట్లు తెలిసింది. అప్పటికే ఈ విషయం ఉన్నతాధికారులకు దృష్టికి వెళ్లినట్లు సమాచారం.

English summary
Tw policemen clashed at Hanumakonda police head quarter in Warangal district of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X