హైదరాబాద్‌లోని పబ్‌ల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు, జాగిలాలతో ఎంట్రీ
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పలు పబ్‌ల్లో ఆదివారం రాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్‌లోని అన్ని పబ్‌ల్లో తనిఖీ చేశారు. సీఎం రేవంత్, హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల నేపథ్యంలో పబ్‌ల్లో డ్రగ్స్ గంజాయి అమ్మకాలపై ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు. కాగా, తాజా తనిఖీల్లో పోలీసు జాగిలాలను రంగంలోకి దించారు.
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా పోలీసులు ప్రణాళిక సిద్ధం చేసుకున్న పోలీసులు.. తనిఖీలతో తమ కార్యాచరణ అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

సీపీ కీలక ఆదేశాలు
హైదరాబాద్‌లోని కమిషనరేట్‌లో ఉన్నతాధికారులు, పోలీస్ సిబ్బందితో సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. కేసుల దర్యాప్తు వేగం పెంచాలని సూచించారు. ఒక్క నేరస్థుడికి శిక్ష పడితే.. 100 మంది భయపడతారని సూచించారు. మరోవైపు డ్రగ్స్ రహిత తెలంగాణ ధ్యేయంగా టీఎస్ న్యాబ్ పని చేస్తుందని ఆ సంస్థ డైరెక్టర్ సందీప్ శాండిల్యా తెలిపారు. భాగ్యనగరంలో ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు కృషి చేయాలని సీపీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన ప్రణాళిలకు సిద్దం చేయాలని ఆదేశించారు.
మాదకద్రవ్యాలతో పాటు డ్రగ్స్ ఇతర నిషేధ వస్తువులు నగరంలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న కేసులు దర్యాప్తు వేగంగా చేసి, నిందితులకు శిక్ష పడేలా చేయాలని విజ్ఞాప్తి చేశారు. సైబర్ నేరాల దర్యాప్తులో దేశంలోనే హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని సీపీ శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థ వద్ద ఉన్న అన్ని సదుపాయాలను వినియోగించుకుని దర్యాప్తు మరింత వేగంగా చేసి రికవరీ రేటును పెంచాలని అధికారులను ఆదేశించారు.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications