ఆ మాటలు నమ్మే బలైపోయింది..: వివాహిత హత్య వెనుక మిస్టరీ..
హైదరాబాద్: రాజేంద్రనగర్ పరిధిలోని శాస్త్రిపురం బల్దియా పార్కులో వివాహిత హత్యకు సంబంధించిన మిస్టరీ వీడింది. పరిచయస్తుడే ఆమెను హతమార్చి పరారైనట్టుగా పోలీసులు గుర్తించారు.ఎట్టకేలకు పోలీసులు అతన్ని పట్టుకోవడంతో అసలు నిజాలు బయటపడ్డాయి.
వివరాల్లోకి వెళ్తే.. శాస్త్రిపురంలో నివసించే పద్మకు విష్ణు అనే వ్యక్తితో కొన్ని నెలలుగా పరిచయం ఉంది. ఏదైనా పనిలో పెట్టించాలని పద్మ విష్ణును కోరగా.. ఓ ఇంట్లో ఆమెను పనికి కుదిర్చాడు. ఓరోజు పద్మకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరం పడి విష్ణును అడిగింది. రూ.10వేలు ఉంటే సర్దాలని తర్వాత అప్పు తీరుస్తానని చెప్పింది.

తన వద్ద డబ్బులకు కొదువలేదని ఎప్పుడూ చెప్పే విష్ణు.. పద్మ అలా అడగడంతో అయోమయంలో పడిపోయాడు. ఇడ్లీ బండి నడిపే విష్ణు వద్ద వాస్తవానికి అంతగా డబ్బు లేకపోయినా.. ఉన్నట్టు నటించేవాడు. ఆ మాటలు నమ్మే పద్మ అతన్ని డబ్బు అడిగింది. దీంతో ఏం చేయాలో అర్థం కాని విష్ణు.. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై పద్మను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.
ఈనెల 30వ తేదీ రాత్రి నిర్మానుష్యంగా ఉన్న పార్కు వద్దకు ఆమెను తీసుకెళ్లాడు. అక్కడే ఇద్దరు కలిసి మద్యం సేవించారు. ఆపై బస్తీకి వెళ్లి మద్యం, మరో డబ్బాలో కిరోసిన్ తీసుకొచ్చాడు. పద్మకు అనుమానం రావడంతో.. అది కిరోసిన్ కాదని, అది కూడా మద్యమేనని నమ్మించాడు. మరోసారి ఆమెపై అత్యాచారం చేసి.. బండరాయితో తలపై బాదాడు.
అప్పటికీ పద్మ చనిపోకపోవడంతో కిరోసిన్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. ఆమె మెడలోని ఆభరణాలు, కాళ్ల పట్టీలు సైతం ఎత్తుకెళ్లాడు. ఇటీవలే ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!!











Click it and Unblock the Notifications