స్వైపింగ్ మిషన్‌తో ఆమె నోట్ల మార్పిడి: 12 మంది అరెస్టు
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో ఈ నెల 22వ తేదీన పెద్ద నోట్ల మార్పిడికి పాల్పడిన ముఠాకు చెందిన 12మంది నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్ చేసినట్లు ఎస్పీ పరిమళ హనా నూతన్ తెలిపారు.
సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో ఈ నెల 22వ తేదీన పెద్ద నోట్ల మార్పిడికి పాల్పడిన ముఠాకు చెందిన 12మంది నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్ చేసినట్లు ఎస్పీ పరిమళ హనా నూతన్ తెలిపారు. గడ్డిపల్లి సమీపంలోని ఓ పెట్రోల్ బంక్‌లో గత వారం నోట్ల మార్పిడికి పాల్పడిన ముఠాకు సంబంధించిన 12మందిని అదుపులోకి తీసుకున్నామని సోమవారం మీడియా సమావేశంలో చెప్పారు.
ఈ ముఠాలో ప్రధాన నిందితుడు గడ్డిపల్లి ఎస్‌బీహెచ్ బ్యాంక్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్న గాదెగాని శ్రీను, పెన్‌పహాడ్ మండలం లింగాల గ్రామానికి చెందిన కేసరి రంగారెడ్డి, గడ్డిపల్లి ఎస్‌బీహెచ్ ఉద్యోగి శన్నం రా మయ్య, గడ్డిపల్లి గ్రామానికి చెందిన బట్టిపల్లి వెంకటరమణ, సంద్యాల సతీష్, గడ్డిపల్లి కాంగ్రెస్ ఎంపీటీసీ సుందూరి నాగేశ్వర్‌రావు, ఆరెపురి నారాయణ, దేగుంట్ల నాగరాజు, నీలకంఠ రాంబాబు, మేడారంకు చెందిన శనం వీరభద్రయ్య, లింగాల గ్రామానికి చెందిన కేసరి శోభ, కుతుబ్షాపురం కాంగ్రెస్ సర్పంచ్ బాణోతు శ్రీనులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

వీరు పలు గ్రామాల రైతుల నుంచి బ్యాంకు పాస్ పుస్తకాల ద్వారా బ్యాంక్‌లో డబ్బలు జమ చేస్తూ వచ్చారు. ఈ ముఠా సభ్యురాలైన శోభ అదే గ్రామంలో కిరాణం షాపు నడుపుతూ మినీ ఎటీఎంగా స్వైపింగ్ మిషన్ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఈ ముఠా జమ చేసిన డబ్బును కొత్త నోట్లుగా మార్పిడి చేసి సహకరిస్తూ వచ్చింది.
పోలీసులు ముఠాకు సంబంధించిన 12మంది నిందితులను వారి వద్ద నుంచి కొత్త 2వేల రూపాయల నోట్లు 3.10లక్షలు, మిగిలిన చిన్ననోట్లు 86,700ల రూపాయలు, ఒక స్వైపింగ్ మిషన్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. 20 శాతం కమిషన్‌తో నోట్లను మార్పిడి చేస్తూ ఈ ముఠాకు అక్రమాలకు పాల్పడినట్లు పరిమళ హనా నూతన్ చెప్పారు
ఈ ముఠాకు చెందిన మిగతా నిందితులను త్వరలో అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మీడియా సమావేశంలో హుజూర్‌నగర్ సీఐ నర్సింహా రెడ్డి, గరిడేపల్లి ఎస్.ఐ రామకృష్ణారెడ్డి, సిబ్బంది ఉన్నారు.












Click it and Unblock the Notifications