డబ్బులు పంచుతూ దొరికిపోయిన పోలిసు అధికారి.. ఏ పార్టీ తరఫున అంటే.?
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు మరి కొద్ది గంటల సమయం మాత్రమే ఉండటంతో.. ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికల ప్రచారం ముగియడంతో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు రాజకీయ నేతలు చేయాల్సిదంతా చేస్తున్నారు. ఓటర్లకు పంచడానికి భారీ ఎత్తున డబ్బులు పంపిణీ కూడా జరుగుతుందని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఏకంగా ఓ పోలీసు అధికారి ఓటర్లకు డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్‌లో ఓ పోలీసు అధికారి తన కారులో భారీ ఎత్తున డబ్బులు తీసుకువెళ్తున్నట్టు గుర్తించిన స్థానికులు..ఆ కారుని వెంబడించి పట్టుకున్నారు.

కారులో తనిఖీలు చేయగా.. ఆరు లక్షల రూపాయిలు పట్టుపడ్డాయి. ఓటర్లకు డబ్బులు పంచుతున్నావంటూ స్థానికులు ఆ పోలీస్ అధికారిని నిలదీశారు. వెంటనే పోలీస్ అధికారితో పాటు.. ఆయన కారులో దొరికిన డబ్బును పోలీసులకు అప్పగించినట్టు తెలుస్తుంది. ఈ డబ్బు మంత్రి మల్లారెడ్డిదే అని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
మల్లారెడ్డి తరఫున ఓటర్లకు పంచడానికే ఆ పోలీసు అధికారి అక్కడకి వచ్చినట్టు చెబుతున్నారు.. అయితే ఈ డబ్బు ఎవరి తరఫున పంచుతున్నారనే సమాచారం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.












Click it and Unblock the Notifications