CRIME:సెలూన్ల పేరుతో గలీజ్ దందా.. ఆ స్పాలో యువతులతో ఏం చేయిస్తున్నారంటే..?
హైదరాబాద్ : పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా.. హైదరాబాదులో మాత్రం చట్టవ్యతిరేక కార్యకలాపాలు యదేచ్ఛగా సాగుతున్నాయి. మసాజ్ పార్లర్ల పేరుతో ఏకంగా సెక్స్ సెంటర్లనే నడుపుతున్నారు. ఇప్పటికే నగర పోలీసులు పలు పబ్బులపై, క్లబ్బులపై దాడులు నిర్వహించిన చాలా సెక్స్ రాకెట్ల గుట్టును రట్టు చేశారు. అయినప్పటికీ ఇంకా ఇలాంటివి గుట్టుచప్పుడు కాకుండా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నగరం నడిబొడ్డున ఉన్న పంజాగుట్టలోని రెండు మసాజ్ సెంటర్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు.

పేరుకే మసాజ్ సెంటర్లు
పంజాగుట్టలోని లోటస్ ఫ్యామిలీ సలూన్ మరియు శ్రీనగర్ కాలనీలోని టెన్జర్ వెల్‌నెస్ స్పా అండ్ బ్యూటీ సలూన్‌లలో సెక్స్ రాకెట్ నిర్వహించినట్లు సమాచారం. సెలూన్లలో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు ఆ రెండు స్పాలపై దాడులు నిర్వహించారు. నిజమే అని తేలడంతో పోలీసులు రెండు స్పాలను సీజ్ చేశారు. అందులోని ఎక్విప్‌మెంట్ మరియు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇక యాజమాన్యంపై కేసును నమోదు చేశారు పోలీసులు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

మంచి జీతాల పేరుతో యువతులకు వల
కస్టమర్లకు మంచి సేవలు ఇచ్చేందుకుగాను మంచి జీతాలు ఇచ్చి ఈ రెండు స్పాలకు చెందిన యాజమాన్యాలు అమ్మాయిలను రిక్రూట్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే మసాజ్ పనులు తప్ప మిగతాపనుల్లన్నీ వారితో చేయిస్తున్నారని పోలీసులు తెలిపారు. అక్కడ ఒక పెద్ద సెక్స్ రాకెట్‌నే నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు అక్కడి అమ్మాయిలకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని పోలీసులు తెలిపారు. ఇక సెలూన్‌లను నిర్వహిస్తున్నది మహిళే కావడం షాకింగ్‌కు గురిచేస్తోంది. లోటస్ ఫ్యామిలీ సెలూన్‌కు సంబంధించి బిజినెస్ లైసెన్స్, కస్టమర్ రిజిస్టర్, ఇతర వివరాలు చూపించాల్సిందిగా పోలీసులు కోరగా అవన్నీ చూపించేందుకు కోమల్ రాథోడ్ నిరాకరించింది. అంతేకాదు పోలీసులకు ఇక్కడేం పని అంటూ దబాయించింది.
Recommended Video


సెలూన్ల పేరుతో సెక్స్ రాకెట్
ఇక సెలూన్‌లో సోదాలు నిర్వహించి, విచారణ చేసిన మీదట ఆ సెలూన్‌లో ఒక ప్రొఫెషనల్ థెరపిస్టు, కానీ క్వాలిఫైడ్ డాక్టర్లు లేదా ఫిజియోథెరిపిస్టులు కూడా లేరని వెల్లడించారు. కస్టమర్ రిజిస్టర్ కూడా లేదని చెప్పిన పోలీసులు, ఇక్కడ జరిగేవన్నీ అరాచక క్రియలే అని చెప్పారు. ఇక సీసీ టీవీ ఫుటేజీలను కూడా వీరు క్రమంగా మెయిన్‌టెయిన్ చేయడం లేదని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే టెన్జర్ వెల్‌నెస్ స్పా మరియు బ్యూటీ సలూన్ నిర్వాహకులైన వినయ్ తనీషాలు ఆ స్పాకు వచ్చే కస్టమర్లకు క్రాస్ మసాజ్ చేయాల్సిందిగా బలవంతపెట్టేవారని పోలీసులు వెల్లడించారు.
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
ఏడు రోజుల్లోనే ఆరు బ్యాంకుల్లో చోరీ.. కానీ దోచుకుంది మాత్రం..? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్!












Click it and Unblock the Notifications