మ్యూజిక్ షాపులపై దాడి: బ్లూఫిల్మ్స్ సీడిలు సీజ్

హైదరాబాద్: హైదరాబాదునగరంలోని మల్కాజిగిరిలో గల వీసీడీ షాపులపై ఎస్‌వోటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమతులు తీసుకోకుండా నిర్వహిస్తున్న షాపులను శనివారంనాడు సీజ్ చేశారు.

అదే సమయంలో పైరసీ సీడీలు, నీలి చిత్రాల సీడీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో కంప్యూటర్లు, సీడీలు, నగదును స్వాధీనం చేసుకోవడంతోపాటు నగేష్ (43) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

మల్కాజిగిరిలోని మ్యూజిక్ వరల్డ్ షాపులో సోదాలు నిర్వహించిన పోలీసులు 27 నీలి చిత్రాల సిడీలను, 102 పైరసి సీడిలను, ఓక కంప్యూటర్‌ను, రెండు సెల్‌ఫోన్లను, రూ.3,450 నగదును స్వాధీనం చేసుకున్నారు.

Police raided music shops at Malkagigiri in Secendurabad seized blue films CDS and piracy CDs.

ఆలయం గుండంలో దంపతుల మృతి

రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం అనంతగిరి గుట్టలో విషాద సంఘటన జరిగింది. పద్మనాభస్వామి దర్శనానికి వచ్చిన దంపతులు ఆలయ గుండంలో మునిగి మృతిచెందారు. స్నానానికి కోనేటిలోకి దిగిన భార్య మునిగిపోతుండగా కాపాడబోయేందుకు భర్త ప్రయత్నించాడు. ఈ క్రమంలో దంపతులిద్దరు గుండంలో మునిగి చనిపోయారు. మృతులు ప్రభావతి, సుధాకర్‌రెడ్డి దారూర్ మండలం గోదాంగూడ వాసులు.

తమ్ముడిని చంపిన అన్న

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సైదాపూర్‌లో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న అన్న తమ్ముడిని దారుణంగా హత్య చేశాడు. మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

వ్యక్తి దారుణ హత్య

ఖమ్మం గ్రామీణం మండలం కోటనారాయణపురం కాలనీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో కొట్టి చంపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+