వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నగ్నంగా డ్యాన్సులు?: హైడ్రోజన్ పబ్‌లో ముజ్రా పార్టీ.. దొరికిపోయారు!

పోలీసులు ఎంట్రీ ఇచ్చే సమయానికి.. వీరంతా పబ్ లో నగ్నంగా డ్యాన్సులు చేస్తున్నట్లు చెబుతున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రగ్స్, పేకాట, గుడుంబా స్థావరాలు.. ఇలా అసాంఘీక కార్యకలాపాలన్నింటి పైనా తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. వీటి గురించి ఏ చిన్న సమాచారం అందినా.. వెంటనే చర్యలు తీసుకునేలా అధికారులను అప్రమత్తం చేసింది.

ప్రస్తుతం డ్రగ్స్ వ్యవహారం హైదరాబాద్‌ను కుదిపేస్తుండటంతో.. దాని మూలాలను సమూలంగా పెకిలించివేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని పబ్ లపై కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జూబ్లీహిల్స్ రోడ్ నం.2లోని షాంగ్రిల్లా ప్లాజాలోని ఆఖరి అంతస్తులో ఉన్న హైడ్రోజన్ పబ్‌పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు.

పబ్‌లో ముజ్రా పార్టీ చేసుకుంటున్న పలువురు హైదరాబాదీ యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీ కోసం 68 మంది యువతీ యువకులు 3 లక్షల రూపాయల అద్దె చెల్లించినట్లు సమాచారం. రాత్రంతా జరిగే ఈ పార్టీలో మందు, విందు, చిందులతొ గడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

Police raids on Hydrogen pub, seven dancers held

బుధవారం రాత్రి దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే పబ్ పై దాడులు చేశారు. ఆ సమయంలో 18మంది యువతీ యువకులు అప్పటికే పబ్ కు చేరుకోగా.. మిగతావారు ఒక్కొక్కరుగా వస్తున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, బేగంపేట్, పాతబస్తీ ప్రాంతాలకు చెందిన సంపన్న వర్గాల యువకులు, ముంబైకి చెందిన ఏడుగురు యువతులు, ఒక హిజ్రా కూడా ఉన్నట్లు గుర్తించారు.

పోలీసులు ఎంట్రీ ఇచ్చే సమయానికి.. వీరంతా పబ్ లో నగ్నంగా డ్యాన్సులు చేస్తున్నట్లు చెబుతున్నారు. పబ్ లో ఇలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నందుకు హైడ్రోజన్‌ పబ్‌ మేనేజర్‌ పద్మనాభంను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరందరిని గురువారం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

English summary
The West Zone Task Force Police on Wednesday night held surprise raids on ‘Hydrogen’ pub at Road Number 2 of Banjara Hills under the jurisdiction of Jubilee Hills Police Station and held 11 persons including seven dancers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X