మందు.. చిందు.. పొందు: శామీర్ పేట్‌లో రేవ్ పార్టీ...ఏడుగురు గజ్వేల్ వైద్యులు అరెస్ట్
వారంతా డాక్టర్లు... వైద్యం చేయాల్సిన చేతులు విస్కీని పట్టుకున్నాయి. వీకెండ్ కావడంతో మిత్రులతో కలిసి సరదాగా పార్టీ చేసుకున్నారు. పార్టీ వరకు అయితే ఫర్వాలేదు.. కానీ అమ్మాయిలను పిలిపించుకుని రేవ్ పార్టీలో మునిగిపోయారు. మందు, మగువలతో పాటు చిందులు కూడా వేశారు. ఇదే వారి కొంప ముంచింది. రేవ్ పార్టీలు చట్టవ్యతిరేకం అని తెలిసినా సైలెంట్‌గా పనికానిచ్చేద్దామనుకుని అడ్డంగా బుక్కయ్యారు. పరువును బజారుకు తెచ్చుకున్నారు. ఈ రేవ్ పార్టీకి వేదికైంది మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలోని సెలిబ్రిటీ రిసార్ట్.
నిత్యం స్టెథిస్‌కోప్‌లు, నాలుగు ఇంజెక్షన్లు ఆరు సర్జరీలతో బిజీగా గడిపే డాక్టర్లు శుక్రవారం రాత్రి ఓ రేవ్ పార్టీ చేసుకున్నారు. వీరంతా మెదక్ జిల్లా గజ్వేల్ ప్రాంతానికి చెందిన వారు. శామీర్‌పేటలోని సెలబ్రిటీ రిసార్ట్‌లో ఓ ప్రైవేట్ విల్లాలో రేవ్ పార్టీ అరేంజ్ చేశారు. మందు,మగువ, చిందులతో పార్టీలో ఎంజాయ్ చేస్తున్న వారిపై ఒక్కసారిగా పోలీసులు దాడి చేయడంతో షాక్‌కు గురయ్యారు. అసలు అటువైపు పోలీసులు వస్తారని కూడా తాము ఊహించి ఉండరు. అడ్డంగా బుక్ అయిపోయారు. పోలీసులను చూడగానే తాగిన మత్తు దెబ్బకు దిగింది.

శామీర్‌పేట్ సీఐ చెప్పిన వివరాల ప్రకారం... సెలిబ్రిటీ రిసార్ట్‌లో రేవ్ పార్టీ జరుగుతోందని తమకు సమాచారం రావడంతో అక్కడ దాడి చేసినట్లు చెప్పారు. రేవ్ పార్టీపై దాడి చేసి గజ్వేల్ ప్రాంతానికి చెందిన ఆరుగురు వ్యక్తులతో పాటు ముంబై నగరానికి చెందిన యువతితో పాటు హైదరాబాద్‌కు చెందిన మరో ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఈ పార్టీకి సంబంధించి ప్రముఖుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఆ పేర్లను బయటపెట్టేందుకు పోలీసులు నిరాకరించారు. ఇదిలా ఉంటే గజ్వేల్ డాక్టర్స్ అసోసియేషన్ పట్టుబడిన డాక్టర్లకు మద్దతుగా నిలిచింది. వారు చిన్నపార్టీ చేసుకుంటే మీడియా దాన్ని అతిగా చూపిస్తోందని మండిపడ్డారు.
ఇక రేవ్ పార్టీలో పట్టుబడిన యువతులను బలవంతంగా ఆపార్టీకి తీసుకొచ్చినట్లు సైబరాబాద్ షీటీమ్ తెలిపింది. ముంబై యువతితో పాటు మరో ముగ్గురిని కూడా బలవంతం చేసి ఈ పార్టీకి తీసుకొచ్చినట్లు షీటీమ్స్ చెబుతోంది. అందరినీ రెస్క్యూ చేసినట్లు వెల్లడించిన షీటీమ్స్... యువతులను తీసుకొచ్చిన మహిళను అరెస్టు చేసినట్లు వెల్లడించింది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications