సింగర్ మంగ్లీపై కేసు, రూ 10 కోట్ల మోసం - ప్రాణహానీ ఉందంటూ..!!
గాయకురాలు మంగ్లీతో పాటు మరో నలుగురిపై కేసు నమోదైంది. మైక్రో ఫైనాన్స్ పేరుతో రూ.10 కోట్లు మోసం చేసినట్లు ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. మంగ్లీతో పాటు ఆమె సోదరుడు, మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని న్యాయవాది సుబ్బారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ కేసు వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు ఏం జరిగిందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
సినీ గాయకురాలు మంగ్లీ మరో వివాదంలో చిక్కుకున్నారు. రూ 10 కోట్లు మోసం చేసారని మంగ్లీ తో పాటుగా ఆమె సోదరుడి పైన ఫిర్యాదులు వచ్చాయి. ఆమెతోపాటు తన సోదరుడు శివపై సైతం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు సమాచారం. మంగ్లీ తనను మోసం చేసిందని.. ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని ఓ న్యాయవాది ఆరోపించారు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు మంగ్లీ, ఆమె సోదరుడితోపాటు మరో ముగ్గురిపై బీఎన్‌ఎస్ సెక్షన్ 351 (2), 352 కింద కేసు నమోదు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది సింగర్ మంగ్లీ. ఆ తర్వాత సినిమాల్లో వరుస పాటలతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. మంగ్లీ, ఆమె సోదరుడు శివ, మరికొంత మంది కలిసి సుమారు 100 మంది నుంచి భారీగా నిధులు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మంగ్లీ పైన ఆరోపణలు.. ఫిర్యాదు
వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని నమ్మించి ఈ డబ్బు తీసుకున్నట్లు ఫిర్యాదు దారుడు చెబుతున్నారు. ఎంత కాలం వేచి చూసినా.. లాభాలు ఇవ్వకపోగా.. అసలు డబ్బు తిరిగి ఇవ్వలేదని బాధితుడు ఆరోపించారు. తనకు ఫోన్ చేసి మంగ్లీ, ఆమె సోదరుడు శివ బెదిరింపులకు పాల్పడినట్టు పంజాగుట్ట పిఎస్ లో న్యాయవాది ఫిర్యాదు చేసారు. తనను యాక్సి డెంట్ చేసి చంపుతానని మంగ్లీ , ఆమె సోదరుడు బెదిరించినట్టు పోలీసులకు చెప్పినట్లు తెలు స్తోంది. వీరితో తనకు ప్రాణ హాని ఉందని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో ఏ5 గా మంగ్లీ, మిగతా నిందితుల పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. ఇప్పుడు ఈ కేసు విషయంలో మంగ్లీ ఏం స్పష్టత ఇవ్వనున్నారనేది కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications