పోలీసుల అదుపులో దివ్వెల మాధురి..?
సస్పెన్షన్ కు గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసన మండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య దివ్వెల మాధురి మరోసారి వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారు. బర్త్ డే ఫంక్షన్ సందర్భంగా అనుమతి లేకుండా మద్యం పార్టీని నిర్వహించినందు వల్ల వారిని హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు.
దివ్వెల మాధురి బర్త్ డే సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ ఈ ఫంక్షన్ నిర్వహించారని సమాచారం. హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ లో గల ది పెండెంట్ అనే ఫామ్ హౌస్ లో ఈ ఫంక్షన్ ఏర్పాటైంది. దీనికి పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ ఫంక్షన్ లో జోరుగా మద్యం పార్టీ సాగింది. నిబంధనల ప్రకారం ముందుగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ నిర్వాహకులు గానీ, ఫామ్ హౌస్ యాజమాన్యం గానీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

ఈ సమాచారం అందిన వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు, ఎస్ఓటీ అధికారులు సంయుక్తంగా ఫామ్ హౌస్ పై దాడులు నిర్వహించారు. పార్టీని భగ్నం చేశారు. నిర్వాహకుల నుంచి భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీసులకు ఎస్ఓటీ పోలీసులకు అందిన పక్కా సమాచారంతో ఫామ్ హౌస్పై సంయుక్తంగా దాడి చేసి బర్త్ డే పార్టీని భగ్నం చేశారు.
అనుమతి లేకుండా మద్యం సేవించడం, లిక్కర్ బాటిళ్లను నిల్వ ఉంచడం, బర్త్ డే పార్టీలో శృతి మించిన స్థాయిలో డీజే సౌండ్స్ వినియోగించడం వంటి కారణాలతో పోలీసులు, ఎస్ఓటీ అధికారులు దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లారు దివ్వెల మాధురి. కొద్దిరోజుల కిందటే హౌస్ నుంచి ఎవిక్ట్ అయ్యారు. ఆమె పుట్టిన రోజు నాడు వివాదాలకు కేంద్రబిందువు అయ్యారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications