హైదరాబాద్ లో 11 గంటల వరకు ఆ రోడ్లు క్లోజ్.. కారణం అదే ?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ - 2025 పోటీలను హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తోంది. ఇప్పటికే అట్టహాసంగా ప్రారంభమైన 72వ ఈ అంతర్జాతీయ అందాల పోటీల్లో 110కి పైగా దేశాల నుంచి సుందరీమణులు విశ్వసుందరి కిరీటం కోసం పోటీపడుతున్నారు. భారత్ తరఫున మిస్ ఇండియా నందిని గుప్తా పోటీలో ఉన్నారు. ఇక అందాల భామలు బృందాలుగా ఏర్పడి తెలంగాణలోని చారిత్రక ప్రదేశాలు, ప్రసిద్ధ ఆలయాలను సందర్శించనున్నారు.
ఈ పోటీల్లో భాగంగా అందాల భామలు నేడు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్, చౌమొహల్లా ప్యాలెస్‌లో విందులో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు మార్గాల్లో దారి మళ్లించారు. మదీనా నుంచి చార్మినార్ వైపు, చార్మినార్ నుంచి శాలిబండ వైపు.. శాలిబండ నుంచి వొల్గా జంక్షన్ వరకు, వొల్గా జంక్షన్ నుంచి మూసబౌలీ మీదుగా ఖిల్వత్ రోడ్డు వరకు అన్ని రకాల వాహనాల రాకపోకల ఎంట్రీ క్లోజ్ చేశారు.

ఈ ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో సహాయం లేదా సమాచారం కోసం 9010203626 హెల్ప్ లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చన్నారు.
దారి మళ్లించిన మార్గాలు ఏవంటే..
నయాపూల్ నుండి చార్మినార్ వైపు వచ్చే వాహనాలను మదీనా జంక్షన్ నుండి సిటీ కాలేజీ వైపు మళ్లించారు. హిమ్మత్ పురా వైపు నుండి వచ్చే వాహనాలను చౌమొహల్లా ప్యాలెస్ వైపు కాకుండా.. వొల్గా జంక్షన్ నుంచి ఫతే దర్వాజ వైపు పంపిస్తారు. అలాగే ఫతే దర్వాజ నుండి వచ్చే వాహనాలను వొల్గా జంక్షన్ నుంచి మళ్లిస్తారు. పూరానాపూల్, గుడ్ విల్ కేఫ్ నుంచి వచ్చే వాహనాలను చార్మినార్, చౌమొహల్లా ప్యాలెస్ వైపు అనుమతించరు. అలానే పలు మార్గాలను మళ్లించినట్టు ప్రకటించారు.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications